Adilabad | పెళ్లైన 4 నెల‌ల‌కు భార్య‌ను చంపాడు.. పారిపోతూ ప్ర‌మాదానికి బ‌ల‌య్యాడు..

Adilabad | అనుమానం న‌వ దంప‌తుల జీవితాల‌ను చిదిమేసింది. పెళ్లైన వారం రోజుల నుంచే భార్య‌పై అనుమానం పెంచుకున్నాడు. త‌రుచూ భార్య‌తో గొడ‌వ‌ప‌డుతూ.. ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంత‌రం పారిపోతూ ప్ర‌మాదానికి బ‌ల‌య్యాడు భ‌ర్త‌. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలోని బంగారుగూడ‌లో శుక్ర‌వారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని బంగారిగూడ‌కు చెందిన మోహితె జైవంత్, ప‌ద్మ దంప‌తుల కుమారుడు అరుణ్ మేస్త్రీ ప‌ని చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ‌కు చెందిన […]

  • By: raj    latest    Sep 01, 2023 2:54 PM IST
Adilabad | పెళ్లైన 4 నెల‌ల‌కు భార్య‌ను చంపాడు.. పారిపోతూ ప్ర‌మాదానికి బ‌ల‌య్యాడు..

Adilabad | అనుమానం న‌వ దంప‌తుల జీవితాల‌ను చిదిమేసింది. పెళ్లైన వారం రోజుల నుంచే భార్య‌పై అనుమానం పెంచుకున్నాడు. త‌రుచూ భార్య‌తో గొడ‌వ‌ప‌డుతూ.. ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంత‌రం పారిపోతూ ప్ర‌మాదానికి బ‌ల‌య్యాడు భ‌ర్త‌. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలోని బంగారుగూడ‌లో శుక్ర‌వారం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని బంగారిగూడ‌కు చెందిన మోహితె జైవంత్, ప‌ద్మ దంప‌తుల కుమారుడు అరుణ్ మేస్త్రీ ప‌ని చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ‌కు చెందిన దీప అనే యువ‌తితో అరుణ్‌కు ఈ ఏడాది మే 11వ‌ తేదీన వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజుల‌కే అరుణ్ త‌న భార్య‌ను అనుమానించ‌డం మొద‌లు పెట్టాడు. త‌రుచూ గొడ‌వ‌ప‌డేవారు. ఈ క్ర‌మంలో పెద్ద‌ల స‌మ‌క్షంలో పంచాయితీలు కూడా జ‌రిగాయి.

నాగుల‌పంచ‌మికి పుట్టింటికి వెళ్లిన దీప‌ను.. ఆగ‌స్టు 29న అల్లుడు అరుణ్‌తో మెట్టినింటికి పంపారు ఆమె త‌ల్లిదండ్రులు. ఇక అరుణ్ దీప‌తో గురువారం రాత్రి గొడ‌వ‌ప‌డ్డాడు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున దీప‌ను మంచానికి క‌ట్టేసి గొంతు నులిమి చంపాడు. అనంత‌రం అరుణ్ త‌న బైక్‌పై పారిపోయాడు.

దీప విగ‌త‌జీవిగా క‌నిపించ‌డంతో.. ఆమె అత్త‌మామ‌లు షాక్‌కు గుర‌య్యారు. అరుణ్‌కు ఫోన్ చేయ‌గా, తానే చంపిన‌ట్లు ఒప్పుకున్నాడు. ఇదే స‌మ‌యంలో మ‌మ‌తా జిన్నింగ్ స‌మీపంలో అరుణ్ త‌న బైక్‌ను లారీకి వేగంగా ఢీకొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు.

భ‌ర్త‌, అత్త‌మామ‌లే త‌మ కూతురిని బ‌లిగొన్నార‌ని దీప త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. భయంతో లారీని ఢీకొట్టాడా..? ప్రమాదవశాత్తు జరిగిందా..? అనేది తెలియాల్సి ఉన్నది.