JD | నా బిడ్ స్వీకరించండి! స్టీల్ ప్లాంట్‌కు JD లక్ష్మినారాయణ లేఖ
JD, Steel Plant విధాత: మొత్తానికి ఏదోలా స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని భుజాన మోస్తూ విశాఖ నుంచి పార్లమెంటుకు చేరాలని తపిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తన పోరాటాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడి ఇనప ఖనిజం సరఫరా చేయడం లేదా వర్కింగ్ కేపిటల్ డబ్బు కోసం ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ ఈమధ్య స్టీల్ ప్లాంట్ బిడ్లు దాఖలుకు ప్రకటన విడుదల చేయగా మొత్తం 29 సంస్థలు ఆసక్తి […]
JD, Steel Plant
విధాత: మొత్తానికి ఏదోలా స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని భుజాన మోస్తూ విశాఖ నుంచి పార్లమెంటుకు చేరాలని తపిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తన పోరాటాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడి ఇనప ఖనిజం సరఫరా చేయడం లేదా వర్కింగ్ కేపిటల్ డబ్బు కోసం ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ ఈమధ్య స్టీల్ ప్లాంట్ బిడ్లు దాఖలుకు ప్రకటన విడుదల చేయగా మొత్తం 29 సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు దాఖలు చేశాయి.
గతంలో సింగరేణి తరఫున స్టీల్ ప్లాంట్ లో బిడ్స్ వేస్తామని చెప్పిన తెలంగాణ పత్తా లేకుండా పోగా
ప్రజల తరఫున తాను బిడ్ దాఖలు చేస్తామని చెప్పిన జేడి(JD) లక్ష్మినారాయణ మాత్రం తన ప్రయత్నం కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో తన బిడ్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన స్టీల్ ప్లాంట్ ఎండికి లేఖ రాశారు. ప్రజల తరఫున తాను వేసిన బిడ్ ను ఆమోదించాలని ఆ లేఖలో లక్ష్మీనారాయణ కోరారు. ఈలేఖను JD ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు.
ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేయడం లేదా వర్కింగ్ కేపిటల్ ఫండింగ్ కోసం జారీ చేసిన నోటీసుల్లో భాగంగా తాను ఆసక్తి వ్యక్తీకరణను తెలుపుతూ బిడ్ వేశానని లక్ష్మీనారాయణ వెల్లడించారు.
కంపెనీ పూర్తి సామర్థ్యంతో పని చేయడానికి సంవత్సరానికి 7.3 మెట్రిక్ టన్నుల ముడి ఇనుము అవసరమవుతుందని తెలిపారు. నాలుగు నెలల కోసం దీని విలువ రూ.850 కోట్లు ఉంటుందన్నారు. ఈ మొత్తాన్ని తాను ప్రజల నుంచి సేకరిస్తున్నానని JD తెలిపారు. స్టీల్ ప్లాంటును కాపాడుకోవడానికి సేకరించిన ఈ మొత్తాన్ని నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బ్యాంకు అకౌంట్లల్లో జమ చేస్తామని వివరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram