వివాహేతర సంబంధం.. ప్రియుడి భార్య, కుమారుడిపై యాసిడ్ దాడి
Maharashtra | ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తన ప్రియుడి భార్య, కుమారుడిపై యాసిడ్ దాడి చేసింది. తీవ్ర గాయాలతో తల్లీకుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్‌కు చెందిన 25 ఏండ్ల మహిళ.. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అతడికి వివాహం కాగా, భార్య, రెండేండ్ల కుమారుడు ఉన్నాడు. అయితే తన భర్తతో మరో మహిళకు వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని భార్య […]

Maharashtra | ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తన ప్రియుడి భార్య, కుమారుడిపై యాసిడ్ దాడి చేసింది. తీవ్ర గాయాలతో తల్లీకుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్‌కు చెందిన 25 ఏండ్ల మహిళ.. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అతడికి వివాహం కాగా, భార్య, రెండేండ్ల కుమారుడు ఉన్నాడు. అయితే తన భర్తతో మరో మహిళకు వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని భార్య పసిగట్టింది. దీంతో భర్తను చాలాసార్లు నిలదీసింది. ఇదే విషయం భర్త తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళకు చెప్పాడు. బాధితురాలు కూడా చాలాసార్లు ఆమెతో గొడవ పెట్టుకుంది.
ఈ పరిణామాల మధ్య ప్రియుడి భార్య, కుమారుడిని హతం చేయాలని ఆ మహిళ నిర్ణయించుకుంది. దీంతో తన ఫ్రెండ్‌తో కలిసి ప్రియుడి భార్య, కుమారుడిపై యాసిడ్ దాడి చేసింది. వారు తీవ్ర గాయాలపాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లీకుమారుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సెల్‌ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.