Acid Attack | పెళ్లి మండపంలోనే నూతన వధూవరులపై యాసిడ్ దాడి
Acid Attack | పెళ్లి మండపంలోనే నూతన వధూవరులపై యాసిడ్ దాడి జరిగింది. మరో 12 మంది బంధువులు కూడా గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో బుధవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. వివరా్లోకి వెళ్తే.. బస్తర్ జిల్లా భాన్‌పూరి పోలీసు స్టేషన్ పరిధిలోని అమబాల్ ఏరియాలో బుధవారం రాత్రి 7 గంటలకు ఓ యువకుడి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. పెళ్లి వేదికపైకి నూతన వధూవరులు వచ్చారు. కాసేపటికే కరెంట్ సరఫరా నిలిచిపోయింది. […]

Acid Attack | పెళ్లి మండపంలోనే నూతన వధూవరులపై యాసిడ్ దాడి జరిగింది. మరో 12 మంది బంధువులు కూడా గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో బుధవారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరా్లోకి వెళ్తే.. బస్తర్ జిల్లా భాన్‌పూరి పోలీసు స్టేషన్ పరిధిలోని అమబాల్ ఏరియాలో బుధవారం రాత్రి 7 గంటలకు ఓ యువకుడి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. పెళ్లి వేదికపైకి నూతన వధూవరులు వచ్చారు. కాసేపటికే కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఇదే అదునుగా భావించిన ఓ యువకుడు తన వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్‌తో నూతన వధూవరులపై దాడి చేశాడు. దీంతో వారిద్దరితో పాటు మరో 12 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జగదల్‌పూర్‌లోని మహారాణి ఆస్పత్రికి తరలించారు. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెకు 10 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులందరికీ చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాసిడ్ దాడికి పాల్పడ్డ దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.