Salman Khan | బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు..! మరోసారి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచే..!

Salman Khan | బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌కు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు సల్మాన్‌ ఖాన్‌ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డీబార్‌తో పాటు రోహిత్‌ అనే మరో వ్యక్తిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. గోల్డీ బ్రార్ సల్మాన్ ఖాన్‌తో మాట్లాడాలనుకుంటున్నారని, ముఖాముఖిగా మాట్లాడి.. మ్యాటర్‌ను క్లోజ్‌ చేయాలనుకుంటున్నారని ఈ-మెయిల్‌లో […]

Salman Khan | బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు..! మరోసారి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచే..!

Salman Khan | బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌కు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు సల్మాన్‌ ఖాన్‌ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డీబార్‌తో పాటు రోహిత్‌ అనే మరో వ్యక్తిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.

గోల్డీ బ్రార్ సల్మాన్ ఖాన్‌తో మాట్లాడాలనుకుంటున్నారని, ముఖాముఖిగా మాట్లాడి.. మ్యాటర్‌ను క్లోజ్‌ చేయాలనుకుంటున్నారని ఈ-మెయిల్‌లో ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో సల్మాన్‌ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని చెప్పినట్లుగా ప్రస్తావించారు.

2018లోను..

సల్మాన్‌ ఖాన్‌(Salman Khan)ను చంపేస్తామని గతంలోనే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరించింది. కృష్ణ జింకల కేసులో సల్మాన్‌ ఖాన్‌ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 2018లో కోర్టు ఆవరణలోనే సల్మాన్‌ను చంపేస్తానని బిష్ణోయ్‌ ప్రకటించారు. ఈ కేసులో సల్మాన్‌ నిర్దోషిగా విడుదలైన విషయం విధితమే.

గతేడాది పంజాబీ సింగర్‌, కాంగ్రెస్‌ సిద్ధూ మూసేవాలా సైతం బిష్ణోయ్‌ గ్యాంగ్‌ (Bishnoi Gang) చేతిలో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత మరోసారి సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు లేఖ రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్‌ భద్రతను కల్పించింది. ఇప్పటికీ సాయుధ గార్డ్‌లు సల్మాన్‌కు భద్రతగా ఉంటూ వస్తున్నారు.

ఆ తర్వాత కొందరు దుండగులు సల్మాన్‌ ఖాన్‌తో (Salman Khan)పాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని లేఖ పంపారు. తాజా బెదిరింపులతో సల్మాన్‌ ఇంటి వద్ద భద్రతను పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు.

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా(Siddhu musewala) హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల బిష్ణోయ్‌ ఇంటర్వ్యూను ఓ ప్రైవేటు చానెల్‌ ప్రసారం చేయగా.. సర్వత్రా కలకలం సృష్టించింది.