Adi Purush | ఆదిపురుష్ సినిమా నిమిషం ఆలస్యం.. థియేటర్‌ను ధ్వంసం చేసిన ప్రభాస్ ఫ్యాన్స్

Adi Purush ప్రదర్శనను నిలిపి వేసిన యాజమాన్యం విధాత, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని జ్యోతి థియేటర్ లో ప్రభాస్ రాముడిగా ఓమ్ రౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ఆది పురుష్ ఈ రోజు విడుదలైంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ థియేటర్లో హోరెత్తించారు. అయితే థియేటర్లో ఆదిపురుష్ సినిమా ఆలస్యంగా ప్రదర్శించడం, బొమ్మ పడడం నిమిషం ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ జ్యోతి థియేటర్ ను […]

Adi Purush | ఆదిపురుష్ సినిమా నిమిషం ఆలస్యం.. థియేటర్‌ను ధ్వంసం చేసిన ప్రభాస్ ఫ్యాన్స్

Adi Purush

  • ప్రదర్శనను నిలిపి వేసిన యాజమాన్యం

విధాత, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని జ్యోతి థియేటర్ లో ప్రభాస్ రాముడిగా ఓమ్ రౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ఆది పురుష్ ఈ రోజు విడుదలైంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ థియేటర్లో హోరెత్తించారు.

అయితే థియేటర్లో ఆదిపురుష్ సినిమా ఆలస్యంగా ప్రదర్శించడం, బొమ్మ పడడం నిమిషం ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ జ్యోతి థియేటర్ ను ధ్వంసం చేశారు. దీంతో యాజమాన్యం ప్రదర్శనను నిలిపి వేసింది.