Adilabad: ఘనంగా.. హనుమాన్ శోభాయాత్ర

అదిలాబాద్ ప్రతినిధి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణం తో పాటు బెజ్జూర్ మండల కేంద్రాలలో హనుమాన్ భక్తులతో శోభాయాత్ర కాషాయమయంగా మారింది. శ్రీహనుమాన్ జయంతిని పురష్కరించుకుని కాగజ్ నగర్, బెజ్జూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి మీదుగా ఆంజనేయస్వామి ఆలయాల నుండి భారీ శోభాయాత్రను నిర్వహించారు. భక్తులతో మండల కేంద్రాలు కాషాయమయంగా మారాయి. మండల పరిసర ప్రాంతాల హిందూ బాంధవులు, శ్రీరామ, శ్రీహనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున శోభాయాత్రలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు. […]

  • Publish Date - April 6, 2023 / 01:10 AM IST

అదిలాబాద్ ప్రతినిధి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణం తో పాటు బెజ్జూర్ మండల కేంద్రాలలో హనుమాన్ భక్తులతో శోభాయాత్ర కాషాయమయంగా మారింది.

శ్రీహనుమాన్ జయంతిని పురష్కరించుకుని కాగజ్ నగర్, బెజ్జూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి మీదుగా ఆంజనేయస్వామి ఆలయాల నుండి భారీ శోభాయాత్రను నిర్వహించారు. భక్తులతో మండల కేంద్రాలు కాషాయమయంగా మారాయి.

మండల పరిసర ప్రాంతాల హిందూ బాంధవులు, శ్రీరామ, శ్రీహనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున శోభాయాత్రలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు.

కాగజ్ నగర్ శోభాయాత్రలో 14 అడుగుల శ్రీ రాముని విగ్రహం, 12 అడుగుల వీర హనుమాన్ విగ్రహం, 8 అడుగుల శ్రీ ఛత్రపతి శివాజి విగ్రహాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి . వేల సంఖ్యలో భక్తులు ఈ మహా శోభాయాత్రలో పాల్గొని శ్రీరాముని కృప పాత్రులయ్యారు