Adilabad | మిషన్ భగీరథ పనులపై సమీక్ష సమావేశం
Adilabad పాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు విధాత, ఉమ్మడి అదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెన్నూర్ నియోజకవర్గంలోని మిషన్ భగీరథ పనులపై జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 102 గ్రామపంచాయతీలు, మూడు మున్సిపాలిటీల పరిధిలోని 64 వార్డుల వారీగా మిషన్ భగీరథ, గ్రిడ్ పనులపై సమీక్షించారు. […]

Adilabad
- పాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు
విధాత, ఉమ్మడి అదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెన్నూర్ నియోజకవర్గంలోని మిషన్ భగీరథ పనులపై జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 102 గ్రామపంచాయతీలు, మూడు మున్సిపాలిటీల పరిధిలోని 64 వార్డుల వారీగా మిషన్ భగీరథ, గ్రిడ్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు సురక్షిత మంచినీరు అందిస్తున్నమని తెలిపారు.
ఆగస్టు 15 లోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులు ఒక రోడ్ మ్యాప్ నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆదేశించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 283 ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి 67,163 గృహాలకు 2,62,000 ప్రజలకు త్రాగు నీరు అందిస్తున్నాం అని పేర్కొన్నారు.
వానా కాలం దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు త్రాగునీరు అందించే విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోమని కాంట్రాక్టర్లను, ఏజెన్సీ అధికారులను హెచ్చరించారు. అవసరమైతే పనిచేయని కాంట్రాక్టర్ లను తొలగించి కొత్తవారిని నియమించి పనులను వేగవంతం చేయాలన్నారు.
ఇప్పటికే పూర్తయిన గ్రామాల్లో జరుగుతున్న నీటి సరఫరాలో లీకేజీలు గాని, డ్యామేజ్ లు గాని ఉంటే వెంటనే మరమ్మతు చేయాలన్నారు. మిషన్ భగీరథ పనుల వల్ల దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునర్నిర్మించాలని తెలిపారు.
వార్డు, గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలో ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ త్రాగు నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని అన్నారు.
ఈ సమావేశంలో ENC కృపాకర్ రెడ్డి, SE జ్ఞాన్ కుమార్, EE అంజన్ రావు ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, నియోజకవర్గ MPP, ZPTC, సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, ఏజెన్సీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.