Adilabad | కాలుష్యం నుంచి రక్షించాలని.. గోదావరి మహా హారతి: మురళీధర్ రావు
Adilabad విధాత, ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: గోదావరి మన జీవన విధానం అని దానిని పరిరక్షించుకునే బాధ్యత మన అందరిపై ఉందని, కాలుష్య కోరల నుండి గోదావరి మాతను రక్షించే ఉద్దేశంతో గోదావరి మహా హారతి నిర్వహిస్తున్నామని గోదావరి హారతి ఉత్సవ సమితి చైర్మన్ పోల్సాని మురళీధర్ రావు అన్నారు. బాసర నుండి భద్రాచలం వరకు చేపట్టిన గోదావరి హారతి యాత్ర కార్యక్రమంలో భాగంగా నేడు 4 వ రోజు యాత్ర మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ […]

Adilabad
విధాత, ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: గోదావరి మన జీవన విధానం అని దానిని పరిరక్షించుకునే బాధ్యత మన అందరిపై ఉందని, కాలుష్య కోరల నుండి గోదావరి మాతను రక్షించే ఉద్దేశంతో గోదావరి మహా హారతి నిర్వహిస్తున్నామని గోదావరి హారతి ఉత్సవ సమితి చైర్మన్ పోల్సాని మురళీధర్ రావు అన్నారు.
బాసర నుండి భద్రాచలం వరకు చేపట్టిన గోదావరి హారతి యాత్ర కార్యక్రమంలో భాగంగా నేడు 4 వ రోజు యాత్ర మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి తీరంలో గోదావరి మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ బిజెపి శ్రేణులు మురళీధర్ రావుకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ… గోదావరి నది కాలుష్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, సమీప గ్రామాలలోని డ్రైనేజీ సిస్టం గోదావరిలోకి వెళ్లడం మూలంగా కాలుష్యం ఏర్పడుతుందన్నారు. గోదావరి దివ్య క్షేత్రాలు అభివృద్ధి, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం గోదావరి హారతి కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు. అలాగే గోదావరి డిప్లరేషన్ లో భాగంగా ఒక ప్రణాళిక రూపకల్పన చేస్తామని తెలిపారు. ఇవాళ సాయంత్రం కాలేశ్వరం ప్రాజెక్టు చేరుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు, బిజెపి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.