Agent | వరంగల్‌లో.. ‘ఏజెంట్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్: పాల్గొన్న నటులు నాగార్జున, అఖిల్, ఎర్రబెల్లి

Agent విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వ‌రంగ‌ల్ లోని రంగ‌లీలా మైదానంలో ఏజెంట్(Agent) తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారంరాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయ‌తీ రాజ్‌ శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్‌, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ దయా కర్, సినీ హీరో అక్కినేని నాగార్జున‌, అక్కినేని అనిల్‌, డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి, హీరోయిన్ సాక్షి వైద్యా, సినిమా యూనిట్ […]

  • By: krs    latest    Apr 23, 2023 5:22 AM IST
Agent | వరంగల్‌లో.. ‘ఏజెంట్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్: పాల్గొన్న నటులు నాగార్జున, అఖిల్, ఎర్రబెల్లి

Agent

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వ‌రంగ‌ల్ లోని రంగ‌లీలా మైదానంలో ఏజెంట్(Agent) తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారంరాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయ‌తీ రాజ్‌ శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్‌, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ దయా కర్, సినీ హీరో అక్కినేని నాగార్జున‌, అక్కినేని అనిల్‌, డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి, హీరోయిన్ సాక్షి వైద్యా, సినిమా యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ ఏజెంట్ గా మ‌న‌మందుకు వ‌స్తున్న అఖిల్ కు అభినంద‌న‌లు తెలిపారు. డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డి మ‌న తెలంగాణ, అందునా వ‌రంగ‌ల్‌ ముద్దు బిడ్డ‌ అత‌నొక్క‌డేతో మొద‌లై పెద్ద హీరోల‌తో సినిమాలు చేశాడు. మమ్ముట్టి ఎన్ని గొప్ప సినిమాలు చేశాడు? దేశం, ఇండ‌స్ట్రీ గ‌ర్వించ‌ద‌గ్గ న‌టులని అన్నారు.

పోసాని కృష్ణమురళి, సాక్షి వైద్యా, డినో మోరియా, మురళీశర్మ ఈ సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌న‌లు! వ‌రంగ‌ల్ లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేసుకున్న ప్ర‌తి సినిమా స‌క్సెస్ సాధించింది. ఈ స‌స్పెన్స్ యాక్ష‌న్ త్రిల్ల‌ర్ ఏజెంట్(Agent) సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుందన్నారు.

వరంగల్‌లో సినీ షూటింగులు జరపాలి

సినిమా ఇండస్ట్రీ వరంగల్‌కు రావాలి ఇందుకు మంత్రిగా నా ప్రయత్నం నేను చేస్తాను. వరంగల్‌లో నిర్వహించిన ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది. మ‌న వ‌రంగ‌ల్ జిల్లా మంచి షూటింగ్‌ స్పాట్, హైద‌రాబాద్ త‌ర్వాత అతి పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ చుట్టుముట్టూ మంచి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి.

రామ‌ప్ప‌, ల‌క్న‌వ‌రం, బొగ‌త వంటి జ‌ల‌పాతాలు, ఏటూరునాగారం అడ‌వులు, వ‌రంగ‌ల్ కోట‌, వేయి స్తంభాల గుడి, భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు వంటి చారిత్ర‌క ప్ర‌దేశాలెన్నో ఉన్నాయి. షూటింగులు చేయాల‌ని ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. అనంత‌రం నాగార్జున, అఖిల్‌ స‌హా, సినిమా యూనిట్ స‌భ్యులంద‌రికీ మంత్రి ఎర్ర‌బెల్లి త‌న నివాసంలో విందు ఇచ్చారు.