Alia Bhatt | సోషల్ మీడియాలో ఫొటోలు చూసిషాకైన అలియా..! తమాషా చేస్తున్నారా అంటూ ఆగ్రహం..!
Alia Bhatt | బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తల్లిగా మారిన తర్వాత తన కూతురు రాహాతో ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నది. రీసెంట్‌గా తన ఫొటోను సోషల్ మీడియాలో చూసి ఆగ్రహానికి గురైంది. ఇందుకు కారణం ఏంటంటే అలియా ఇంట్లో ఉండగా రహస్యంగా తీసిన ఫొటోలు. ఈ ఫొటోలను ఓ న్యూస్ పోర్టల్ ప్రచురించగా.. ఆలియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా […]

Alia Bhatt | బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తల్లిగా మారిన తర్వాత తన కూతురు రాహాతో ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నది. రీసెంట్‌గా తన ఫొటోను సోషల్ మీడియాలో చూసి ఆగ్రహానికి గురైంది. ఇందుకు కారణం ఏంటంటే అలియా ఇంట్లో ఉండగా రహస్యంగా తీసిన ఫొటోలు. ఈ ఫొటోలను ఓ న్యూస్ పోర్టల్ ప్రచురించగా.. ఆలియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. ‘తమాషా చేస్తున్నారా? సాధారణ మధ్యాహ్నం నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా నా వద్దకు వచ్చినట్లు అనిపించింది.
మా ఇంటి పక్కనే ఉన్న బిల్డింగ్‌పై కెమెరాలతో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఇలా చేయడం సరైందేనా? ఇది వ్యక్తి గోప్యతకు భంగం కలిగించడం కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముంబయి పోలీసులను సైతం ట్యాగ్ చేసింది. ఇదిలా ఉండగా.. అలియా ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసింది. అలియా చివరిగా బ్రహ్మస్త్రలో కనిపించింది. త్వరలో రణ్‌వీర్‌సింగ్ సరసన ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’లో కనిపించనున్నది. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఏ దిల్ హై ముష్కిల్’ తర్వాత కరణ్ చాలా కాలం తర్వాత దర్శకుడిగా మారబోతున్నాడు.