విరాళాలన్నీ బీజేపీకే.. 80% కార్పొరేట్ల నుంచే

80శాతం కార్పొరేట్ల నుంచే కొవిడ్‌ కాలంలోనూ పెరిగిన డొనేషన్స్‌ విధాత: కొవిడ్‌ కాలంలో సాధారణ వ్యాపారులు, కంపెనీలు, సంస్థలకు నష్టాలు వచ్చాయి కానీ.. రాజకీయ పార్టీలకు మాత్రం లాభాలే వచ్చాయంటున్నది అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రైట్స్‌ (ఏడీఆర్‌). 2021-22 కాలంలో జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలు అందుకు సాక్ష్యం. మునుపటి ఏడాదితో పోల్చితే.. 2021-22లో రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలు రూ.187.03 కోట్లు పెరిగాయట. అంటే.. ఏకంగా 31.50 శాతం పెరుగుదల! 2021-22 ఆర్థిక సంవత్సరంలో […]

  • By: Somu    latest    Feb 15, 2023 11:51 AM IST
విరాళాలన్నీ బీజేపీకే.. 80% కార్పొరేట్ల నుంచే
  • 80శాతం కార్పొరేట్ల నుంచే
  • కొవిడ్‌ కాలంలోనూ పెరిగిన డొనేషన్స్‌

విధాత: కొవిడ్‌ కాలంలో సాధారణ వ్యాపారులు, కంపెనీలు, సంస్థలకు నష్టాలు వచ్చాయి కానీ.. రాజకీయ పార్టీలకు మాత్రం లాభాలే వచ్చాయంటున్నది అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రైట్స్‌ (ఏడీఆర్‌). 2021-22 కాలంలో జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలు అందుకు సాక్ష్యం. మునుపటి ఏడాదితో పోల్చితే.. 2021-22లో రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలు రూ.187.03 కోట్లు పెరిగాయట. అంటే.. ఏకంగా 31.50 శాతం పెరుగుదల!

2021-22 ఆర్థిక సంవత్సరంలో తమకు అందిన విరాళాలు (రూ.20వేలకు మించి) మొత్తం రూ.780.77 కోట్లు. వీటిలో అత్యధికంగా బీజేపీకి రూ.614 కోట్లు అందాయి. కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాలు 95 కోట్లు మాత్రమేనని ఏడీఆర్‌ తెలిపింది.

బీజేపీకి 4,957 మంది ఈ విరాళాలు ఇవ్వగా, కాంగ్రెస్‌కు విరాళాలు ఇచ్చిన వారి సంఖ్య 1,255గా ఉన్నది. తమకు 20వేలకు మించిన డొనేషన్‌ ఒక్కటి కూడా రాలేదని బీఎస్‌పీ తెలిపింది. బీజేపీకి గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 29 శాతం పెరిగాయి. కాంగ్రెస్‌కు విరాళాలు 28శాతం పెరిగాయి.

అందిన విరాళాల్లోనూ దాదాపు 395 కోట్లు ఒక్క ఢిల్లీ నుంచే అందాయి. మహారాష్ట్ర నుంచి 105 కోట్లు, గుజరాత్‌ నుంచి 45 కోట్లు అందాయని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. జాతీయ పార్టీలకు విరాళాలు అందించిన పెద్ద చేతులు కార్పొరేట్‌ శక్తులే కావడం విశేషం. కార్పొరేట్‌, వ్యాపార వర్గాల నుంచి అందిన మొత్తం 626 కోట్లుగా ఉన్నది. అంటే మొత్తం విరాళాల్లో కార్పొరేట్స్‌ ఇచ్చినది 80 శాతం.