Adipurush | ప‌విత్ర గ్రంథాల‌ను అప‌విత్రం చేస్తారా? ఆదిపురుష్ నిర్మాత‌పై హైకోర్టు సీరియస్‌

Adipurush | ప్ర‌జ‌లు బుద్ధిహీనులనుకున్నారా? హిందూ గ్రంథాలంటే చిన్న చూపా? అన్ని మ‌తాల విశ్వాసాల‌ పరిరక్షిస్తాం అది న్యాయస్థానాల కర్తవ్యం అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు అలహాబాద్‌: ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ జంట‌గా ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆదిపురుష్ (Adipurush) సినిమా వివాదాస్ప‌ద డైలాగుల‌పై అల‌హాబాద్ హైకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డింది. ‘మీరు ఈ దేశ ప్ర‌జ‌ల‌ను బుద్ధిహీనులుగా భావిస్తున్నారా? హిందువుల ప‌విత్ర గ్రంథాలంటే మీకు అంత చిన్న చూపా" అంటూ ప్ర‌శ్నించింది. ఈ కేసులో ఒక […]

Adipurush | ప‌విత్ర గ్రంథాల‌ను అప‌విత్రం చేస్తారా? ఆదిపురుష్ నిర్మాత‌పై హైకోర్టు సీరియస్‌

Adipurush |

  • ప్ర‌జ‌లు బుద్ధిహీనులనుకున్నారా? హిందూ గ్రంథాలంటే చిన్న చూపా?
  • అన్ని మ‌తాల విశ్వాసాల‌ పరిరక్షిస్తాం
  • అది న్యాయస్థానాల కర్తవ్యం
  • అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు

అలహాబాద్‌: ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ జంట‌గా ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆదిపురుష్ (Adipurush) సినిమా వివాదాస్ప‌ద డైలాగుల‌పై అల‌హాబాద్ హైకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డింది. ‘మీరు ఈ దేశ ప్ర‌జ‌ల‌ను బుద్ధిహీనులుగా భావిస్తున్నారా? హిందువుల ప‌విత్ర గ్రంథాలంటే మీకు అంత చిన్న చూపా” అంటూ ప్ర‌శ్నించింది.

ఈ కేసులో ఒక మ‌తాన్ని వెనుకేసుకురావ‌డం లేద‌ని, కోర్టుల‌కు అన్ని మ‌తాల విశ్వాసాల‌ను ప‌రిర‌క్షించ‌డం న్యాయ‌స్థానం క‌ర్త‌వ్యం అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆదిపురుష్ సినిమాలో రాముడు, ఆంజ‌నేయుడు పాత్ర‌ల‌తో మాట్లాడించిన మాట‌లు హిందూ ప‌విత్ర గ్రంథాల‌కు, విశ్వాసాల‌కు విరుద్ధంగా ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డింది.

“మీరు ఖురాన్‌, బైబిల్‌, ఇత‌ర మ‌త గ్రంథాల‌ను కూడా ఇలా చేయ‌కూడ‌దు. మేము ఈ రోజు చెబుతున్న‌ది ఇదే.. కోర్టు ఉద్దేశం ఒక మ‌తాన్ని వెనుకేసుకురావ‌డం కాదు, అన్ని మ‌తాల విశ్వాసాల‌ను చ‌ట్ట‌ప‌రంగా ప‌రిర‌క్షించ‌డ‌మే” అని జ‌స్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్‌, జ‌స్టిస్ ప్ర‌కాశ్ సింగ్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. సినిమా తీస్తున్నప్పుడు ఆ చిత్ర నిర్మాతల హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చిత్రీక‌రించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇటీవ‌ల కాలంలో హిందూ దేవ‌త‌లు, దేవుళ్ల‌ను కించ‌ప‌రిచేలా చిత్రీక‌రించ‌డం పెరిగిపోయింద‌ని పేర్కొన్నారు. “ఈ రోజు మనం నోరు మూసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇలాంటి సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. శివుడి గురించిన‌ సినిమా చూశాను. ఈ సినిమాలో శివుడు త్రిశూల్‌తో న‌డుస్తున్న‌ట్లు త‌మాషాగా చూపించారు. సినిమా వ్యాపారం వ‌ల్ల నిర్మాతలు డబ్బు సంపాదిస్తారు.

కానీ ఈ త‌ర‌హా అప‌హాస్యం ఎటు వెళుతుంది? మ‌తాల మ‌ధ్య సామ‌ర‌స్యాన్ని విచ్ఛిన్నం చేయ‌డం కాక ఇంకేమిటి? ఇదేమి త‌మాషా? హిందూ దేవుళ్ల‌ను ఇలా త‌మాషాగా చూపించిన నిర్మాత‌.. ఖురాన్ మీద త‌మాషాగా చిన్న డాక్యుమెంట‌రీ తీస్తారా? తీస్తే అప్పుడు ఏం జ‌రుగుతుందో చూస్తారు” అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సినిమాలో హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినే స‌న్నివేశాల‌ను, సంభాష‌ణ‌ల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని కోర్టు చిత్ర నిర్మాత‌ను, సంభాష‌ణ‌లు రాసిన వ్య‌క్తిని ఆదేశించింది.