Video| మొసలితో పెట్టుకున్న ముసలోడు.. చివరకు ఏం జరిగిందంటే..?
Alligator | మొసలి.. ఆ పేరు వింటేనే శరీరంలో వణుకు పడుతోంది. దాన్ని ప్రత్యక్షంగా చూస్తే గుండెల్లో రైళ్లు పరుగుగెడుతాయి. మొసళ్లు మనషులు, జంతువులపై అవలీలగా దాడి చేస్తుంటాయి. వాటి చేతుల్లో ప్రాణాలు కోల్పోవడమో, తీవ్రంగా గాయ పడటమో జరుగుతుంది. అంత భయానకంగా మొసలి ఉంటుంది. అలాంటి మొసలి పట్ల ఓ ముసలోడు పెట్టుకున్నాడు. దాన్ని పట్టుకునేందుకు వెళ్లి విఫలమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ నీటి మడుగులో ఉన్న మొసలిని […]

Alligator | మొసలి.. ఆ పేరు వింటేనే శరీరంలో వణుకు పడుతోంది. దాన్ని ప్రత్యక్షంగా చూస్తే గుండెల్లో రైళ్లు పరుగుగెడుతాయి. మొసళ్లు మనషులు, జంతువులపై అవలీలగా దాడి చేస్తుంటాయి. వాటి చేతుల్లో ప్రాణాలు కోల్పోవడమో, తీవ్రంగా గాయ పడటమో జరుగుతుంది. అంత భయానకంగా మొసలి ఉంటుంది. అలాంటి మొసలి పట్ల ఓ ముసలోడు పెట్టుకున్నాడు. దాన్ని పట్టుకునేందుకు వెళ్లి విఫలమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఓ నీటి మడుగులో ఉన్న మొసలిని పట్టుకునేందుకు ఓ వృద్ధుడు యత్నించాడు. అందులో భాగంగా మొసలి ముఖంపై ముందుగా టీ షర్ట్ వేస్తాడు. ఇక ఆ తర్వాత దానిపై కూర్చొని, ముఖాన్ని అదిమిపట్టేందుకు యత్నిస్తాడు. కానీ మొసలి అప్రమత్తమై ముసలోడిపై తిరగబడుతుంది.
వృద్ధుడి చేతిపై మొసలి దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో.. దాన్నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదకరమని తెలిసి కూడా మొసలిని పట్టుకునేందుకు యత్నించిన వృద్ధుడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.
Video| మొసలితో పెట్టుకున్న ముసలోడు.. చివరకు ఏం జరిగిందంటే..? https://t.co/vFE3SzilVZ pic.twitter.com/sVY1fBmHbC
— vidhaathanews (@vidhaathanews) November 24, 2022