స్నేహ రెడ్డి క్యూట్ మూమెంట్స్ షేర్ చేస్తూ భార్యకి బర్త్ డే విషెస్ చెప్పిన బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా బన్నీకి మంచి క్రేజ్ అందించింది. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్‌తో పుష్ప 2 అనే చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అయితే బన్నీకి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో దాదాపు అదే రేంజ్ లో బన్నీ సతీమణి కూడా క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో తన కూతురు, భర్తకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక్కోసారి హీరోయిన్స్‌కి మించిన అందంతో కూడా అదరగొడుతూ ఉంటుంది స్నేహా రెడ్డి. ఈ క్రమంలో స్నేహా రెడ్డికి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది.
అయితే ఈ రోజు స్నేహా రెడ్డి బర్త్ డే కావడంతో ఆమెకి బన్నీ అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అల్లు స్నేహా రెడ్డి కి బన్నీ బర్త్ డే విషెస్ చెబుతూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు తెగ రచ్చ చేస్తుంది. వీడియోలో బన్నీ తన భార్యని పలు సందర్భాలలో క్యాప్చర్ చేసి వాటన్నింటిని కూడా అందంగా వీడియో రూపంలో తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హ్యాపీ బర్త్ డే క్యూటీ.. నా జీవితానికి వెలుగువి నువ్వే అని కామెంట్ పెట్టి స్నేహా రెడ్డికి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్‌ను చెప్పాడు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
తన భార్య బర్త్ డే సందర్భంగా బన్నీ వర్క్‌కి బ్రేక్ ఇచ్చి లండన్ టూర్ ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఈ జోడీ లండన్‌లోనే షికార్లు చేస్తోంది. ఇక అక్కడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. మొత్తానికి భార్య కోసం బన్నీ ఇస్తున్న సర్‌ప్రైజ్‌లు అదిరిపోతున్నాయి. ఇక అల్లు అర్జన్ ప్రస్తుతం సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్‌తో కూడా బిజీగా ఉన్నాడు. పుష్ప2 చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌కి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బన్నీ అన్ని కూడా పాన్ ఇండియా చిత్రాలే చేయబోతున్నట్టు తెలుస్తుంది.