Amzaon Offers | మొబైల్‌ఫోన్లు కొనాలకుంటున్నారా..? అమెజాన్‌లో ఇయర్ ఎండ్ సేల్స్..!
కొత్త గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. 2023 సంవత్సరం ముగుస్తుండడంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి
Amzaon Offers | కొత్త గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. 2023 సంవత్సరం ముగుస్తుండడంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్డ్ ఇయర్ ఎండ్ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు తీసుకువచ్చింది. తాజాగా అమెజాన్ సైతం ఆఫర్స్‌ను ప్రకటించింది. అందులో వన్‌ప్లస్, శాంసంగ్, షావోమీ, ఆపిల్ తదితర టాప్ బ్రాండ్స్ మొబైల్స్ బంపర్ ఆఫర్స్‌ను ప్రకటించింది. అయితే, ఎప్పటి వరకు ఆఫర్స్ కొనసాగుతాయో మాత్రం కంపెనీ పేర్కొనలేదు.
అయితే, కస్టమర్లు రూ.9,999 కన్నా తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పొందే వీలున్నది. రూ.1,383 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను అందిస్తుంది. అమెజాన్ ఆపిల్ ఐఫోన్-13పై డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నది. ఆపిల్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఎ15 బయోనిక్ చిప్‌సెట్, 6.1-అంగుళాల సూపర్ రెటీనా, ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, వెడల్పు, అల్ట్రా-వైడ్ లెన్స్‌లతో కూడిన డ్యూయల్ 12ఎంపీ బ్యాక్ కెమెరా సెన్సార్, 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ సెటప్ ఉంటుంది. అలాగే, వన్‌ప్లస్‌పై సత్ అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. శాంసంగ్ ఫోన్లను సైతం తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ మొబైల్స్‌లో గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ ఆఫర్‌పై వస్తుంది. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే 5ఎన్ఎమ్ ఎక్సినోస్ 1280 ఎస్ఓసీ, 6.6-అంగుళాల పూర్తి-హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 8ఎంపీ సెన్సార్, 2ఎంపీ సెన్సార్‌ను సెన్సార్ ఉంది. వీటితో పాటు పలు ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులపై సైతం ఆఫర్స్‌ను అమెజాన్ అందిస్తున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram