Medak: ఆర్థిక అసమానతల తొలగింపునకు కృషిచేసిన మహనీయుడు అంబేద్కర్: ప్రతిమా సింగ్
విధాత, మెదక్ బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిన్నతనం నుంచి అనేక వివక్షతలు, అవమానాలను ఎదుర్కొని పట్టుదలతో ఉన్నత విద్యలను అభ్యసించి దేశానికి మార్గదర్శకం చేశారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. అయన ఏ ఒక్క వర్గానికి పరిమిత కాదని, ప్రతి వర్గంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించి, సమాజంలో ఉన్న అసమానతలు తగ్గించేందుకు ఎంతో కృషి చేశారని, వారు చూపిన సన్మార్గంలో నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి […]

విధాత, మెదక్ బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిన్నతనం నుంచి అనేక వివక్షతలు, అవమానాలను ఎదుర్కొని పట్టుదలతో ఉన్నత విద్యలను అభ్యసించి దేశానికి మార్గదర్శకం చేశారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. అయన ఏ ఒక్క వర్గానికి పరిమిత కాదని, ప్రతి వర్గంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించి, సమాజంలో ఉన్న అసమానతలు తగ్గించేందుకు ఎంతో కృషి చేశారని, వారు చూపిన సన్మార్గంలో నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక జి.కె.ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, టీఎన్జీవోల నాయకుడు దొంత నరేందర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంజీవ్, డిఎస్పీ సైదులు. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు బాల్ రాజ్, వివిధ సంఘాల నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ఆర్ధిక వ్యవస్థ నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనదని, అన్ని వర్గాలను సమ దృష్టిలో పెట్టుకొని ఎంతో ముందు చూపుతో అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖించారన్నారు. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని, వారి సేవలు ప్రజలకు గుర్తుండిపోయేలా నేడు హైదరాబాద్ లో 125 అడుగులు అతిపెద్ద కాంస్య విగ్రహం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని అన్నారు.
అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ భారత దేశాన్ని అభివృధి పథంలో ఎలా ముందుకు నడపాలి.. వివిధ దేశాలలో చట్టాలు ఎలా ఉన్నాయి.. మన దేశ మానవ స్థితిగతులు ఎలా ఉన్నాయో అధ్యయనం చేసి అందరికి ఆమోదయోగ్యమైన చక్కటి రాజ్యాంగాని అంబేద్కర్ మనకు అందించారని అన్నారు. నేడు ఆ రాజ్యాంగానికి లోబడి వ్యవస్థ నడుస్తున్నదని, అట్టి రాజ్యాంగాన్నీ ప్రతి ఒక్కరు చదివి హక్కులు, చట్టాల గురించి తెలుసుకోవాలని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు మహనీయుల చరిత్రలను చదివి, స్ఫూర్తి పొంది వారి ఆశలు, ఆశయాలకనుగుణంగా సమాజ సేవ చేయాలన్నారు.
డిఎస్పీ సైదులు మాట్లాడుతూ ఉన్నత శిఖరాలలో ఉన్న వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ఆశయ సాధన కోసం ఇష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భగా వ్యాసరచ, వక్తృత్వ, పెయింటింగ్ పోటీలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. అదేవిధంగా జై భీమ్ సంఘం నుండి సామాజిక సేవా కార్యక్రమాలలో విశిష్ట సేవలు చేసిన సామాజిక కార్యకర్తలను శాలువా, జ్ఞాపికలతో వారు సన్మానించారు. గురుకుల పాఠశాలల విద్యార్థినులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి
కార్యక్రమంలో జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఆర్.డి.ఓ. సాయి రామ్, టి.యెన్.జి.ఓ. అధ్యక్షులు నరేందర్, కార్యదర్శి రాజ్ కుమార్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంజీవ్, ఉపాధ్యక్షులు ప్రభాకర్, కార్యదర్శి హరి ప్రసాద్, కన్వీనర్ సామెల్, సభ్యులు దుర్గయ్య, బి.సి. సంఘం అధ్యక్షులు మెట్టు గంగా రామ్, బొందుగుల నాగరాజ్, మురళి, విద్యార్థిని, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.