AP
విధాత: మనం ఏమీ అనలేని మన శత్రువును ఇంకోడు ఘోరంగా తిడుతున్నడు అంటే మనకు హ్యాపీ.. మనం చేయలేని పని వెరేవాడు చేస్తున్నాడు కాబట్టి..ఇప్పుడు ఏపీలో టిడిపి కూడా చాలా హ్యాపీగా ఉంది. జగన్ను తాము ఏమీ చేయలేకపోతున్నామని బాధ ఒక వైపు.
అదే జగన్ను ఢిల్లీ పెద్దలు.. బిజెపి నేతలు నెత్తిన పెట్టుకుంటున్నారు అన్న దుగ్ధ మరోవైపు టిడిపి వాళ్ళను దహించేస్తుంది. సరిగ్గా ఇప్పుడు వాళ్లకు కాస్త రిలీఫ్ దొరికింది.వారి మనసుల్లో మృగశిర కార్తె చినుకులు కురిసినట్లు అయింది. విశాఖప్నం వచ్చిన అమిత్ షా జగన్ మీద ఫైర్ అయ్యారు..వైసిపి సర్కారు అవినీతిమయం అని విమర్శించారు.
నాలుగేళ్ల కాలంలో ఏమి సాధించారు ?
ఎటు చూసిన అక్రమాలే తప్ప ఏముంది మీ పాలన అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ఏపీ మూడవ స్థానంలో ఉందన్నారు. మోడీ ఏపీకి నిధులు ఇస్తున్నారని అయినా తమవే పధకాలు అని చెప్పుకుంటున్నరని ఆరోపించారు.
ఏపీ నిధులపై లెక్కలతో సహాచెప్పి జగన్ బండారాన్ని బయటపెట్టిన అమిత్ షా | Amit Shaw | ABN Telugu#amithsha #bjp #vishakapatnam #abntelugu pic.twitter.com/Wt6mwcLA1G
— ABN Telugu (@abntelugutv) June 12, 2023
కేంద్రం ఇచ్చే పధకాల మీద జగన్ ఫోటో ఎందుకు ? అ కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తే అవి ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గడచిన తొమ్మిదేళ్ళలో ఏపీకి సంబంధించి నిధులు ఇస్తే వాటిని ఏపీ ప్రభుత్వాలు ఖర్చు చేయలేదని అమిత్ షా అంటున్నారు.
బిజెపిని గెలిపించాలని అని మాత్రమే కోరిన హోమ్ మంత్రి ఎక్కడా ఏపీలో పొత్తుల గురించి మాట్లాడలేదు. ఈమధ్య కాలంలో జగన్ మీద ఈ స్థాయి నేతలు ఇలా గట్టిగా మాట్లాడింది లేదు.. దీంతో ఈ స్పీచ్ టిడిపి నేతల చెవుల్లో పానకం పోసినట్లు అయింది.