Pahalgam Terror Attack: ఉగ్రదాడి మృతులకు అమిత్ షా నివాళులు..సమీక్షలు

జమ్మూ కశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న అమిత్ షా మృతదేహాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. పరిస్థితిపై ప్రధానీ మోదీ, అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు సమీక్షలు చేశారు.

Pahalgam Terror Attack: ఉగ్రదాడి మృతులకు అమిత్ షా నివాళులు..సమీక్షలు

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న అమిత్ షా మృతదేహాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి ఓదార్చారు. కాల్పుల ఘటన జరిగిన తీరుతెన్నుల వివరాలను అమిత్ షా వారిని అడిగి స్వయంగా తెలుసుకొన్నారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వారికి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టుదని వారికి ఆయన స్పష్టం చేశారు.

నిన్న ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే పహల్గాంలోని బైసరన్ మైదాన ప్రాంతం సందర్శనకు వచ్చిన దేశ విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పథకం మేరకు దాడి చేశారు. ఆర్మీ దుస్తులతో తుపాకులతో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకుల ఐడేంటి కార్డులు చూసి హిందువులను, విదేశీయులను టార్గెట్ చేసి కాల్పులకు తెగబడ్డారు. పారిపోతున్న వారిపై కూడా కాల్పులు జరిపారు. మైదాన ప్రాంతం కావడంతో.. పర్యాటకులకు తప్పించుకొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణించారు
పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సైన్యం వెంటనే రంగంలోకి దిగి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడి ఘటనకు తమదే బాధ్యత అంటూ ఇప్పటికే లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’ ప్రకటించింది. ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో సమీక్షించారు. అలాగే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఎరివేతకు యుద్ద ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. మరోవైపు ఢిల్లీలో త్రివిధ దళాలలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలో సమీక్ష చేశారు.

బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల సహాయం, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

కశ్మీర్ పత్రికల నిరసన
ఉగ్రదాడి ఘటనపై కశ్మీర్ పత్రికలు తమ నిరసన తెలిపాయి. నలుపు రంగులో మొదటి పేజీని ముద్రించడం ద్వారా నిరసన వెల్లడించాయి.
గ్రేటర్‌ కశ్మీర్‌, రైజింగ్ కశ్మీర్‌, కశ్మీర్‌ ఉజ్మా పత్రికల్లో ఉగ్రదాడి ఘటనను వివరిస్తూ కథనాలు ప్రచురించారు.

పాక్ మీదుగా వెళ్లకుండా సౌదీ నుంచి భారత్ కు ప్రధాని మోదీ
కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, తిరుగు పయనంలో ఆయన విమానం పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించి భారత్ కు చేరుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో రూట్‌ మార్చినట్లు సమాచారం

ఏయిర్ పోర్టులో సమీక్ష
ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ ఎయిర్‌పోర్టులోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ లతో భేటీయై ఉగ్రదాడిపై చర్చించారు. భద్రతా చర్యలపై ఆరాతీశారు. మరోవైపు, ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ కూడా నేడు భేటీ కానుంది.

ఉగ్రవాదుల ఊహాచిత్రాల విడుదల
జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించే పనిలో భాగంగా నలుగురు ఉగ్రవాదుల చిత్రాలను బుధవారం నిఘా సంస్థలు విడుదల చేశాయి. అంతకుముందు మరో ఉగ్రవాది ఫొటోను సైతం విడుదలు చేశారు. దాడిలో పాల్గొన్న ఐదుగురి ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ ఇప్పటికే లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’ ప్రకటించింది. ఆ సంస్థ టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్ ఈ ఘటనకు ప్రధాన సూత్రదారి అని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.అలాగే రావల్ కోట్‌లోని ఇద్దరు వ్యక్తులతో ఈ ఘటనకు ప్రమేయం ఉందని వెల్లడించాయి.