Amrutha Pranay | హీరో కార్తికేయతో బెదరకొట్టిన అమృత ప్రణయ్.. మార్పు మొదలైంది
Amrutha Pranay | జీవితంలో ప్రతి విషయాన్ని దాటుకుని వెళ్ళగలిగే సత్తాను, ధైర్యాన్ని కాలమే ఇస్తుందంటారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కాలం చేసే మాయాజాలం మనిషి మేధాశక్తికి అందదు అందుకేనేమో.. ప్రేమించుకున్న నేరానికి పెద్దల్ని కాదని ఒకటయ్యారని, కూతురు భర్తని, అల్లుడనే మమకారం కూడా లేకుండా ధనికుడనే మత్తులో పరువు హత్యకు పాల్పడ్డాడు మారుతీరావు. ప్రణయ్ పరువు హత్య జరిగి ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా ఎవరూ మరిచిపోలేకపోతున్నారు. అతని జీవితం లోకి అమాయకంగా అడుగు పెట్టిన అమృత.. […]
Amrutha Pranay |
జీవితంలో ప్రతి విషయాన్ని దాటుకుని వెళ్ళగలిగే సత్తాను, ధైర్యాన్ని కాలమే ఇస్తుందంటారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కాలం చేసే మాయాజాలం మనిషి మేధాశక్తికి అందదు అందుకేనేమో.. ప్రేమించుకున్న నేరానికి పెద్దల్ని కాదని ఒకటయ్యారని, కూతురు భర్తని, అల్లుడనే మమకారం కూడా లేకుండా ధనికుడనే మత్తులో పరువు హత్యకు పాల్పడ్డాడు మారుతీరావు.
ప్రణయ్ పరువు హత్య జరిగి ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా ఎవరూ మరిచిపోలేకపోతున్నారు. అతని జీవితం లోకి అమాయకంగా అడుగు పెట్టిన అమృత.. తన బిడ్డలో భర్త ప్రణయ్‌ని చూసుకుని బ్రతుకుతుంది. ఎందరు ఎన్ని చెప్పినా, మళ్ళీ కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టమని సలహాలిచ్చినా ఇంకా దూరమైన భర్తనే తలుచుకుని బిడ్డతో బ్రతికేస్తుంది. కాలం తెచ్చిన మార్పు ఏదైనా ఉందంటే అమృత ఇప్పుడిప్పుడే పాత చేదు జ్ఞాపకాలను మరిచిపోయి మళ్ళీ కొత్త లోకంలోకి అడుగుపెడుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాషన్ వైపు మొగ్గుచూపుతుంది. ఇక విషయంలోకి వెళితే..
ప్రణయ్ మరణం తర్వాత అమృత తన లైఫ్‌ని డీల్ చేస్తున్న విధానం చాలామందికి నచ్చింది. ఆమె ఏం చేసినా ఎందరో అమృత వెంట నడుస్తున్నారు. సపోర్ట్‌గా ఉంటున్నారు. దీనికి పెద్ద ఉదాహరణ ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్ పేజ్ చూస్తేనే తెలుస్తుంది. ఎందరో అభిమానులు, శ్రేయోభిలాషులు అమృత వెంట ఉన్నారు. తను ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో ఎందరికో నచ్చుతుంది. ఇక కొందరు ప్రముఖులతో కూడా అమృతకు మంచి పరిచయాలే ఉన్నాయి. అమృతతో సెలబ్రిటీలు సైతం కలిసి రీల్స్ చేస్తున్నారు.
View this post on InstagramFollow us on Social Media
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram