స్కెలిటన్‌లా మారిన అమీ జాక్సన్..ఏదైన వ్యాధితో బాధపడుతుందా?

అందాల ముద్దుగుమ్మ అమీ జాక్సన్ గురించి ప్రత్యేక పరిచయాలుఅక్కర్లేదు. ఈ అమ్మడు తెలుగు, తమిళంతో పాటు పలు భాషలలో నటించి మెప్పించింది. రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాలో రెండో కథానాయికగా నటించిన బ్రిటన్ బ్యూటీ … విక్రమ్ ‘ఐ’, ఆర్య ‘మదరాసు పట్టణం, రోబో2 వంటి చిత్రాలతో ప్రేక్షకాదరణ దక్కించుకుంది. సినిమాల సంగతేమో కాని ఎఫైర్స్‌తో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. పెళ్లి కాకుండానే తల్లి కావడం.. ఆ తర్వాత ప్రియుడితో బ్రేకప్.. మళ్లీ ప్రేమ ఇలా అమీ జాక్సన్ అందరి అటెన్షన్‌ని తన వైపుకి తిప్పుకుంటుంది. ఆ మధ్య ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా ముందు ఎడ్ వెస్ట్ విక్, అమీ జాక్సన్ లిప్ లాక్ తెగ హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేని ఈ భామ సోషల్ మీడియా ద్వారా కూడా అందరి అటెన్షన్ తనపై పడేలా చేస్తుంది.
అమీ జాక్సన్ ఎప్పటికప్పుడు సరికొత్త లుక్‌లో కనిపిస్తూ అందరిని షాక్‌కి గురి చేస్తూ ఉంటుంది. తన సినిమాల కోసం అమీజాక్సన్ చాలా లుక్స్ మార్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అమ్మడి లుక్ ప్రతి ఒక్కరిని షాక్‌కి గురి చేస్తుంది. అమీ జాక్సనేనా అనేలా ఆమె లుక్ ఉంది. ఇందులో ఆమె హెయిర్ స్టైల్ చిన్నగా, కంటిబొక్కలు పైకి కనిపించే లుక్ లో స్కెలిటన్ మాదిరిగా దారుణంగా మారిపోయింది. అమీజాక్సన్ అంటే నమ్మేలా లేదనేలా ఉంది. అమీ జాక్సన్‌ని ఇలా చూసిన వారందరు ఏంటి ఆమె ఏదైన ఏమైనా వ్యాధితో బాధపడుతుందా? లేదంటే తన సినిమా కోసం ఇలాంటి లుక్ లోకి మారిపోయిందా అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కొంపదీసి ‘ఐ’ సినిమాలో విక్రమ్ ను మోసం చేసినందుకు చియాన్ పగ తీర్చుకున్నాడా ఏంటని కొందరు ఫన్నీగా కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఎప్పుడు తన ప్రేమ, పెళ్లి విషయాలతో హాట్ టాపిక్‌గా ఉండే అమీ జాక్సన్ తన లుక్స్‌తో చర్చనీయాంశంగా మారడం విశేషం. 16 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన అమీ జాక్సన్.. 2009లో మిస్ టీన్ వరల్డ్.. 2010 మిల్ లివర్ పూల్ గా సత్తా చాటింది. ఆ తర్వాత 2010లో మద్రాసపట్టణంలో సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హిందీలో ఏక్ దీవానా థా సినిమా చేసింది. అనంతరం తెలుగు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది.