‘నాటునాటు’ పాటకు రాంచరణ్‌తో కలిసి స్టెప్పులేసిన ఆనంద్‌ మహీంద్రా!

Anand Mahindra | రాంచరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కిన RRR బంపర్‌ హిట్టయ్యింది. ఈ చిత్రంలోని పాట ‘నాటునాటు’ పాట తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపుఊపింది. ఈ పాటకు ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు స్టెప్పులేశారు. తాజాగా ప్రముఖ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సైతం స్టెప్పులేశారు. హైదరాబాద్‌ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫార్ములా-ఈ రేసింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. తొలిసారిగా దేశంలో నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్‌ను చూసేందుకు సినీ, […]

  • By: krs    latest    Feb 11, 2023 2:19 PM IST
‘నాటునాటు’ పాటకు రాంచరణ్‌తో కలిసి స్టెప్పులేసిన ఆనంద్‌ మహీంద్రా!

Anand Mahindra | రాంచరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కిన RRR బంపర్‌ హిట్టయ్యింది. ఈ చిత్రంలోని పాట ‘నాటునాటు’ పాట తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపుఊపింది. ఈ పాటకు ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు స్టెప్పులేశారు.

తాజాగా ప్రముఖ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సైతం స్టెప్పులేశారు. హైదరాబాద్‌ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫార్ములా-ఈ రేసింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. తొలిసారిగా దేశంలో నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్‌ను చూసేందుకు సినీ, రాజకీయ, క్రీడారంగ ప్రముఖులు హాజరయ్యారు.

అలాగే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం పోటీలను తిలకించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో కలిసి RRR సినిమాలోని నాటునాటు పాటకు కాళ్లు కదిపారు. అక్కడే ఉన్న పలువురు తమ సెల్‌ఫోన్లను ఈ దృశ్యాలను బంధించి.. సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

ఆనంద్‌ మహీంద్రా సైతం ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలపడంతో పాటు.. RRR చిత్రంలోని నాటునాటు సాంగ్‌కు ఆస్కార్‌ రావాలని ఆకాంక్షిస్తూ.. ఆల్‌ది బెస్ట్‌ మై ఫ్రెండ్‌ అంటూ వీడియోను ట్వీట్‌ చేశారు.