Anasuya | వారంతా నాపై ఆధారపడి ఉన్నారు, పాపం.. అనసూయ కోపానికి కారణం ఏంటి?
Anasuya: కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా యాంకర్ అనసూయ మారుతుంది.ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం బుల్లితెరకి గుడ్ బై చెప్పి సినిమాలతో బిజీగా ఉంది. ఇదే సమయంలో అనసూయ.. వివాదాలతో హాట్ టాపిక్ అవుతుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ అనసూయ వరుస కామెంట్స్ చేయడంతో ఆయన అభిమానులు అనసూయని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఈ వివాదంతో చాలా రోజుల పాటు అనసూయ హాట్ టాపిక్‌గా మారింది. ఇక రీసెంట్‌గా ఆ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం […]
Anasuya: కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా యాంకర్ అనసూయ మారుతుంది.ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం బుల్లితెరకి గుడ్ బై చెప్పి సినిమాలతో బిజీగా ఉంది. ఇదే సమయంలో అనసూయ.. వివాదాలతో హాట్ టాపిక్ అవుతుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ అనసూయ వరుస కామెంట్స్ చేయడంతో ఆయన అభిమానులు అనసూయని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఈ వివాదంతో చాలా రోజుల పాటు అనసూయ హాట్ టాపిక్‌గా మారింది. ఇక రీసెంట్‌గా ఆ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం కూడా చేసింది. ఇక ఆమె గతంలో అల్లు అర్జున్‌పై ఆమె చేసిన షాకింగ్ అండ్ కాంట్రవర్సీ కామెంట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతుండడంతో బన్నీ అభిమానులు తిట్టి పోస్తున్నారు.

పాత వీడియోలో అనసూయ మాట్లాడుతూ.. అసలు అల్లు అర్జున్ హీరో ఏంటీ? మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారా ఏంటి? గంగోత్రి చూసి అసలు మనందరికీ ఏమైంది అని నాకు అనిపించింది.. ఓ పాటలో లంగాఓణిలో అల్లు అర్జున్ ను అస్సలు చూడలేకపోయాను అని అనసూయ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.దీంతో బన్నీ అభిమానులతో పాటు మెగా అభిమానులు అనసూయపై ఫుల్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో అనసూయ తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘వావ్… నేను వాళ్లకు చాలా ముఖ్యం. నా ప్రమేయం ఉన్నా లేకపోయిన, నాకు సంబంధం ఉన్నా లేకపోయిన… నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదు.
నాపై అందరు ఆధారపడి ఉన్నారు. నా పేరు లేకుండా ఏదీ చెప్పలేకపోతున్నట్టున్నారు అంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. బన్నీ అభిమానులని ఉద్దేశించే అనసూయ ఇలా ట్వీట్ చేసి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ‘విమానం’ చిత్రంతో పలకరించింది. ఇందులో వేశ్య పాత్రలో కనిపించి అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ తో పాటు సింబా, తమిళంలో ‘వోల్ఫ్ వంటి చిత్రాలు చేస్తుంది అనసూయ.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram