Anasuya | అంత‌లా ఏడ‌వ‌డంపై క్లారిటీ ఇచ్చిన అన‌సూయ‌.. త‌ప్పుగా అర్ధం చేసుకున్నారంటూ కామెంట్

Anasuya | అన‌సూయ అనే పేరు చెబితే ఆమె గ్లామ‌ర్ షోనే గుర్తుకు వ‌స్తుంది. బుల్లితెర నుండి వెండితెర వ‌ర‌కు త‌న గ్లామ‌ర్‌తో యూత్‌ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. ఇక సోష‌ల్ మీడియాలో అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న హాట్ హాట్ సొగ‌సుల‌తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తుంది. ఇక అప్పుడ‌ప్పుడు వివాదాల‌తో సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ అవుతుంది. ఎప్పుడు ఏదో ఒక విష‌యంతో మాత్రం వార్త‌ల‌లో నిలుస్తుంటుంది అన‌సూయ‌. అయితే ఈ అమ్మ‌డు రీసెంట్‌గా త‌న […]

  • By: sn    latest    Aug 20, 2023 5:45 PM IST
Anasuya | అంత‌లా ఏడ‌వ‌డంపై క్లారిటీ ఇచ్చిన అన‌సూయ‌.. త‌ప్పుగా అర్ధం చేసుకున్నారంటూ కామెంట్

Anasuya | అన‌సూయ అనే పేరు చెబితే ఆమె గ్లామ‌ర్ షోనే గుర్తుకు వ‌స్తుంది. బుల్లితెర నుండి వెండితెర వ‌ర‌కు త‌న గ్లామ‌ర్‌తో యూత్‌ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. ఇక సోష‌ల్ మీడియాలో అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న హాట్ హాట్ సొగ‌సుల‌తో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తుంది. ఇక అప్పుడ‌ప్పుడు వివాదాల‌తో సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ అవుతుంది.

ఎప్పుడు ఏదో ఒక విష‌యంతో మాత్రం వార్త‌ల‌లో నిలుస్తుంటుంది అన‌సూయ‌. అయితే ఈ అమ్మ‌డు రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియాలో వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో ఒక‌టి షేర్ చేసి దానికి జ‌త‌గా సుదీర్ఘ పోస్ట్ యాడ్ చేసింది. ఇందులో త‌ను అంత‌లా ఏడ‌వడానికి ఎలాంటి కార‌ణం చెప్ప‌లేదు.

అయితే అనసూయ రాసిన స్టోరీ క్షుణ్ణంగా చదివిన వారంద‌రు ఆమె నెగిటివిటి గురించి ఏడ్చింద‌ని అనుకున్నారు. సోష‌ల్ మీడియాలో త‌న‌కు విప‌రీత‌మైన నెగెటివిటీ ఏర్ప‌డుతున్న నేప‌థ్యంలోనే అంత‌లా ఏడుస్తుంద‌ని భావించారు. అయితే ఇదంతా వేరే రూట్‌లో పోతుంద‌ని భావించిన అన‌సూయ మ‌రో వీడియో షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది.

నేను సోష‌ల్ మీడియాలో ఏర్ప‌డిన నెగెటివిటీ వ‌ల‌న ఏడ్చాన‌ని అంద‌రు అనుకున్నారు. కాని సోషల్ మీడియా వల్ల ఏడ్చే రకం నేను కాదు. నెగిటివిటి ఉంటే నా ఫీలింగ్ కోపం తో క‌నిపిస్తుంది త‌ప్ప ఏడుపుతో కాదు అని పేర్కొంది. తన జీవితంలో తీసుకున్నఒక కీల‌క నిర్ణయం కారణంగా అంతలా ఏడ్చాన‌ని పేర్కొంది. నాలాంటి ప‌బ్లిక్ ఫిగ‌ర్ ఏడ్చి ఇలా వీడియో షేర్ చేయ‌డం క‌రెక్టేనా అని ఆలోచించాను. నేను ఒంట‌రిని కాదు అని భావించి ఇలా వీడియో చేసి సోష‌ల్ మీడియాలో పెట్టిన‌ట్టు పేర్కొంది అన‌సూయ

వీడియో చేసిన త‌ర్వాత తాను సంతోషంతో పార్ల‌ర్‌కి వెళ్లి ఫేషియ‌ల్ కూడా చేయించుకున్న‌ట్టు అన‌సూయ పేర్కొంది. సండే కూడా త‌న‌కు వ‌ర్కింగ్ డే అని ఈ అమ్మ‌డు పేర్కొంది. అన‌సూయ చివ‌రిగా విమానం చిత్రంతో ప‌ల‌క‌రించ‌గా, ప్ర‌స్తుతం పుష్ప‌2 అనే చిత్రం చేస్తుంది. వీటితో పాటు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ అమ్మ‌డి చేతిలో ఉన్నాయి.