AP and Telangana | త‌గ్గేదే లే..! అప్పుల కోసం తెలుగు రాష్ట్రాలు పోటాపోటీ

AP and Telangana విధాత‌, హైద‌రాబాద్‌: అప్పుల విష‌యంలో తెలుగు రాష్ట్రాలు త‌గ్గేదే లే అంటూ పోటీ పడుతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ అప్పులు ఫిబ్ర‌వ‌రి, 2023 నాటికి 4 ల‌క్ష‌ల 86 వేల 302 కోట్లు ఉన్నాయ‌ని, అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 4 ల‌క్ష‌ల 42 వేల 442 కోట్లు ఉన్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది. అయితే తాజాగా మ‌రో 500 కోట్లు అప్పు కావాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం రిజ‌ర్వు బ్యాంక్‌కు ఇండెంటు పంపింది. ఈ నెల 21న జ‌రిగే […]

  • By: krs    latest    Sep 21, 2023 12:19 AM IST
AP and Telangana | త‌గ్గేదే లే..! అప్పుల కోసం తెలుగు రాష్ట్రాలు పోటాపోటీ

AP and Telangana

విధాత‌, హైద‌రాబాద్‌: అప్పుల విష‌యంలో తెలుగు రాష్ట్రాలు త‌గ్గేదే లే అంటూ పోటీ పడుతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ అప్పులు ఫిబ్ర‌వ‌రి, 2023 నాటికి 4 ల‌క్ష‌ల 86 వేల 302 కోట్లు ఉన్నాయ‌ని, అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు 4 ల‌క్ష‌ల 42 వేల 442 కోట్లు ఉన్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది.

అయితే తాజాగా మ‌రో 500 కోట్లు అప్పు కావాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం రిజ‌ర్వు బ్యాంక్‌కు ఇండెంటు పంపింది. ఈ నెల 21న జ‌రిగే ఈ-వేలంలో ఏడేళ్ల కాల‌ప‌రిమితితో ఈ రుణం తీసుకోనున్న‌ట్లు ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. మ‌రోవైపు ఏపీ ప్ర‌భుత్వం కూడా మ‌రో 1000 కోట్లు అప్పు తీసుకోబోతున్న‌ది.

అదే రోజు జ‌రిగే సెక్యూరిటీల వేలంలో 13 ఏళ్ల కాలంలో తిరిగి చెల్లించే విధంగా ఈ అప్పు తీసుకోనున్న‌ది. అయితే తెలుగు రాష్ట్రాల‌తో క‌లిపి మొత్తం దేశంలోని 12 రాష్ట్రాలు 12 వేల 723 కోట్ల రూపాయ‌ల అప్పుల కోసం రిజ‌ర్వు బ్యాంకుకు ఇండెంట్లు స‌మ‌ర్పించాయి.