Free bus: ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్.. చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నట్టు చెప్పారు. దీంతో సూపర్ సిక్స్ లోని మరో హామీని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయనున్నది.
Free bus: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆ రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణసౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఏపీలో కూటమి సర్కారుకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో అమలవుతున్న ఈ పథకం.. ఏపీలో ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో కూటమి సర్కారు మీద విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ పథకంపై చంద్రబాబు స్పందించారు. కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ మేరకు ప్రకటించారు. రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడాలని చంద్రబాబు సూచించారు. ప్రతి నెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగులు కూడా ప్రతినెలా మూడో శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. రైతుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు. 1999లో తమ ప్రభుత్వ హయాంలోనే రైతు బజార్ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. తాము తెచ్చిన రైతు బజార్ల వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని వివరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram