AP Government: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..ఖాతాల్లో నిధుల జమ!
అమరావతి : ఏపీ సర్కార్ ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని గురువారం నుంచే అమలు చేయనున్నట్లుగా ప్రకటించింది. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు ఖాతాల్లో జమ చేయనున్నట్లుగా సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. రేపు లబ్దిదారుల ఖాతాల్లో రూ,8745 కోట్ల నిధులు జమ చేస్తామని తెలిపింది. ఈ ఏడాది ఒకటో తరగతి, ఇంటర్‌లో చేరిన వారికీ తల్లికి వందనం అమలు చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం గురువారం నుంచి తల్లికి వందనం కూడా అమలు చేయనుంది.
ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram