Punch Prasad | పంచ్ ప్రసాద్‌కు AP CM సహాయం

విధాత‌: కిడ్నీ స‌మ‌స్య‌తో బాధపడుతూ నిత్యం డయాలసిస్ మీద ఆధారపడి ఇబ్బందుల్లో ఉన్న జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ (Punch Prasad)కు ఆంధ్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. అయన చికిత్సకు తాము సాయం చేస్తాం అని ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ డాక్టర్ హరికృష్ణ వెల్లడించారు. రెండు కిడ్నీలు దెబ్బతినగా ప్రసాద్ డయాలసిస్‌తో ఊపిరి నిలుపుకుంటూ వస్తున్నారని చెప్పారు. దీనికి కిడ్నీ ఇవ్వడానికి అయన భార్య సైతం ముందుకు వచ్చినా అది సరిపోలేదు. దీంతో అయన […]

  • By: krs    latest    Jun 10, 2023 3:46 PM IST
Punch Prasad | పంచ్ ప్రసాద్‌కు AP CM సహాయం

విధాత‌: కిడ్నీ స‌మ‌స్య‌తో బాధపడుతూ నిత్యం డయాలసిస్ మీద ఆధారపడి ఇబ్బందుల్లో ఉన్న జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ (Punch Prasad)కు ఆంధ్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. అయన చికిత్సకు తాము సాయం చేస్తాం అని ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ డాక్టర్ హరికృష్ణ వెల్లడించారు.

రెండు కిడ్నీలు దెబ్బతినగా ప్రసాద్ డయాలసిస్‌తో ఊపిరి నిలుపుకుంటూ వస్తున్నారని చెప్పారు. దీనికి కిడ్నీ ఇవ్వడానికి అయన భార్య సైతం ముందుకు వచ్చినా అది సరిపోలేదు. దీంతో అయన సమస్య మరింత జటిలంగా మారింది. అయితే ఆయన్ను ఆదుకునేందుకు కొంతమంది జబర్థస్త్‌ నటులు, ఇతరులు ఆయనకు సాయం చేశారు.

మరోవైపు పంచ్‌ ప్రసాద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అండగా నిలవనున్నారు. ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి ఏపీ సీఎంవో దృష్టికి వెళ్లింది. దీంతో సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ.. ప్రసాద్‌కు సాయం చేస్తామని అన్నారు. ప్రాసెస్‌ పూర్తవగానే సాయం చేస్తామని స్పష్టం చేశారు.

పంచ్‌ ప్రసాద్‌ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామన్నారు. పంచ్‌ ప్రసాద్‌ కుటుంబసభ్యులతో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ అప్లికేషన్‌ పెట్టిస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు.. సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. పంచ్‌ ప్రసాద్‌ సమస్య అతి త్వరలో సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి వెళ్లనుంది. వీలైనంత త్వరగా ఆయనకు సాయం అందనుంది.