High Court | పీఏసీల్లో సిబ్బందిని వెంటనే నియమించండి: హైకోర్టు
High Court | రెండు నెలల్లో సిబ్బందితోపాటు మౌలిక వసతులు ఏర్పాటుచేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు హైదరాబాద్, విధాత: పీఏసీల్లో సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. రాష్ట్ర, జిల్లా స్థాయి పీఏసీల్లో సిబ్బంది నియామకం చేపట్టలేదని పేర్కొంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌ను నియమించి నెలల గడుస్తున్నా కానీ రాష్ట్ర, […]

High Court |
- రెండు నెలల్లో సిబ్బందితోపాటు మౌలిక వసతులు ఏర్పాటుచేయాలి
- రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, విధాత: పీఏసీల్లో సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. రాష్ట్ర, జిల్లా స్థాయి పీఏసీల్లో సిబ్బంది నియామకం చేపట్టలేదని పేర్కొంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌ను నియమించి నెలల గడుస్తున్నా కానీ రాష్ట్ర, జిల్లా స్థాయి పీఏసీల్లో మాత్రం సిబ్బందిని నియమించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. పీఏసీల్లో సిబ్బంది కొరతే కాకుండా మౌలిక వసతులు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల చాలా అక్కడున్న సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారని సూచించారు.
త్వరగా పీఏసీల్లో సిబ్బంది నియామయకంతో పాటు మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పోలీస్ కంప్లైంట్ అథారిటీకి సిబ్బందిని నియమించడంతోపాటు, మౌలిక వసతులను రెండు నెలల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఉన్నత ధర్మాసనం ఆదేశించింది.