విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేల నియామకం
తెలంగాణ ప్రభుత్వ విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేలు ఆడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, రామచంద్రనాయక్‌లను నియమించారు

విధాత : తెలంగాణ ప్రభుత్వ విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేలు ఆడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, రామచంద్రనాయక్‌లను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తనతో పాటు 12మంది మంత్రివర్గంతో కొలువు తీరగా, మరో ఆరు ఖాళీలున్నాయి.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పదవుల రేసులో భారీగా ఆశావహులున్నారు. వారిని ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు తదితర పోస్టుల భర్తీ ద్వారా సర్ధుబాటు చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ విప్ పదవులు కట్టబెట్టింది.