Children’s Games With Snakes: వీళ్లు పిల్లలా…స్నేక్ క్యాచర్లా..!?..

Children’s Games With Snakes: వీళ్లు పిల్లలా…స్నేక్ క్యాచర్లా..!?..

Children’s Games With Snakes: పాములంటేనే పెద్దవాళ్లు సైతం భయంతో దూరంగా వెలుతారు. అలాంటిది పిల్లలను వాటి దగ్గరకు కూడా పోకుండా చూస్తుంటారు. అయితే ఓ ఇద్దరు చిన్నారు బాలురు మాత్రం పాములను ఆట వస్తువులనుకున్నారే ఏమోగాని..పరుగెత్తే పామును వెంటాడి పట్టుకుని మరి మురిసిపోయిన వీడియో వైరల్ గా మారింది. ;పాములతో ఆ పిల్లల ప్రమాదకర ఆటలు చూసిన వారికి వారికి ఏమవుతుందేమోనన్న భయాందోళనలకు గురవ్వక మానరు.  ఓ మైదానంలో ఆడుకుంటున్న ఇద్దరు బాలురు పామును చూసి దానిని పట్టుకునే ప్రయత్నం చేశారు.

ఈ ప్రయత్నంతో ఓ బాలుడు విఫలమైనా..మరో బాలుడు మాత్రం దానిని పట్టుకునే వరకు పట్టు విడువలేదు. బుసలు కొట్టి కరిచేందుకు ప్రయత్నిస్తున్నా లెక్క చేయకుండా ఏ మాత్రం భయం లేకుండా పామును పట్టుకుని దాని తలను చేతిలో అదిమిపట్టి విజయ గర్వాన్ని ప్రదర్శించాడు. ఈ వీడియోచూసిన వారంతా వామ్మో వీళ్లు పిల్లలా లేక స్నేక్ క్యాచర్లా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం పాముల పట్ల అవగాహన లేకనే ఆ పిల్లలు అంతా దుస్సాహసం చేశారని..ఇలాంటి వాటికి పిల్లలు దూరంగా ఉండాలంటున్నారు. మరి మీరు మీరు కూడా ఈ వీడియోను ఓ లుక్కు వేయండి మరి.