Shruti Haasan | ఆర్ యూ వర్జిన్..? టాలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్‌ను ప్రశ్నించిన నెటిజన్.. నటి స్పందన ఇదీ..!
Shruti Haasan | టాలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ మంచి జోరుమీదున్నది. ఆమె నటించిన చిత్రాలు వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నది. అయితే, వరుస సినిమాలతో బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నది. ఎప్పటికప్పుడు తన చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల అభిమానులతో […]

Shruti Haasan | టాలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ మంచి జోరుమీదున్నది. ఆమె నటించిన చిత్రాలు వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నది. అయితే, వరుస సినిమాలతో బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నది. ఎప్పటికప్పుడు తన చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
ఓ నెటిజన్ ‘నేను మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నాను’ అంటూ కామెంట్ చేయగా.. శ్రుతి నో చెప్పింది. మరో నెటిజన్ ఓ అడుగు ముందుకు వేసి ‘ఆర్ యూ వర్జిన్’ అంటూ ప్రశ్నించాడు. అయితే, దీన్ని సరదాగా తీసుకున్న శ్రుతి హాసన్ ‘ముందు నువ్వు స్పెల్లింగ్ సరిగా రాయడం నేర్చుకో. వర్జిన్ స్పెల్లింగ్ ఇదేనా’ అంటూ కౌంటరిచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ శంతను హాజరికాతో కలిసి బ్యూటీ నెజిటన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. బ్యూటీ ప్రస్తుతం సలార్ చిత్రంలో నటిస్తున్నది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.