Art Work | మార్జాలం.. ఒక మహత్యం! గులకరాళ్లతో అద్భుత కళాఖండం
Art Work | బ్రిటీష్ ఆర్టిస్ట్ జస్టిన్ బాట్‌మాన్ సృజన సోషల్ మీడియాలో వీడియో వైరల్ విధాత: కొన్ని కళాఖండాలను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. నిజంగా వాటికి ప్రాణం ఉన్నదా అన్నట్టు ఉంటాయి. కొందరు కళాకారులు తమ కళతో వాటికి జీవం పోస్తారు. కొన్ని పక్షులు, పెంపుడు జంతువులు అచ్చుగుద్దినట్టుగా ఉంటాయి. వాటికి ప్రాణం లేదంటే నమ్మడం కష్టం. వివిధ వస్తువులతో కళాత్మక ఖండాలను తీర్చిదిద్దేవారు విశ్వవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న […]

Art Work |
- బ్రిటీష్ ఆర్టిస్ట్ జస్టిన్ బాట్‌మాన్ సృజన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
విధాత: కొన్ని కళాఖండాలను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. నిజంగా వాటికి ప్రాణం ఉన్నదా అన్నట్టు ఉంటాయి. కొందరు కళాకారులు తమ కళతో వాటికి జీవం పోస్తారు. కొన్ని పక్షులు, పెంపుడు జంతువులు అచ్చుగుద్దినట్టుగా ఉంటాయి. వాటికి ప్రాణం లేదంటే నమ్మడం కష్టం. వివిధ వస్తువులతో కళాత్మక ఖండాలను తీర్చిదిద్దేవారు విశ్వవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచ్‌లలో గులకరాళ్లతో అద్భుతమైన పోర్ట్రెయిట్‌లను రూపొందించడంలో పేరుగాంచిన బ్రిటిష్ కళాకారుడు జస్టిన్ బాట్‌మాన్. గులకరాళ్ల లోఆకర్షణీయమైన పోర్ట్రెయిట్లను తీర్చిదిద్దడంలో అతడు దిట్ట.
View this post on Instagram
గులకరాళ్లతో పిల్లి పోర్ట్రెయిట్‌ను ఇటీవల తీర్చిదిద్దాడు. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. దానికి ఏడు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఆ కళాఖండాన్ని చూసిన నెటిజన్లు.. నిజంగా పిల్లి మట్టిలో కూరుకుపోయిందా? అని ఆశ్చర్యపోయారు. అంతలా జీవం ఉట్టిపడేలా పిల్లి చిత్రం ఉన్నది. కళాకారుడి ప్రతిభకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.