ఆ.. అనుభూతి కోసం.. పురీషనాళంలో 8 ఇంచుల ఫిరంగి గుండు..
Artillery Shell | శృంగార అనుభూతి కోసం ఓ వృద్ధుడు వికృత చర్యకు పాల్పడ్డాడు. ఎవరూ ఊహించని విధంగా ఓ ఫిరంగి గుండును తన పురీష నాళంలోకి చొప్పించుకున్నాడు. దీంతో అనుభూతి కలగలేదు కానీ తీవ్ర ఆందోళనకు మాత్రం దారి తీసింది. పురీషనాళంలో ఇరుక్కుపోయిన ఫిరంగి గుండును శస్త్ర చికిత్స తొలగించారు వైద్యులు. మరి ఆ వృద్ధుడు గురించి తెలుసుకోవాలంటే ఫ్రాన్స్ వెళ్లక తప్పదు. ఫ్రాన్స్‌కు చెందిన 88 ఏండ్ల వృద్ధుడి శృంగార కోరికలు అధికంగా కలిగాయి. […]

Artillery Shell | శృంగార అనుభూతి కోసం ఓ వృద్ధుడు వికృత చర్యకు పాల్పడ్డాడు. ఎవరూ ఊహించని విధంగా ఓ ఫిరంగి గుండును తన పురీష నాళంలోకి చొప్పించుకున్నాడు. దీంతో అనుభూతి కలగలేదు కానీ తీవ్ర ఆందోళనకు మాత్రం దారి తీసింది. పురీషనాళంలో ఇరుక్కుపోయిన ఫిరంగి గుండును శస్త్ర చికిత్స తొలగించారు వైద్యులు. మరి ఆ వృద్ధుడు గురించి తెలుసుకోవాలంటే ఫ్రాన్స్ వెళ్లక తప్పదు.
ఫ్రాన్స్‌కు చెందిన 88 ఏండ్ల వృద్ధుడి శృంగార కోరికలు అధికంగా కలిగాయి. ఆ కోరికలను అణుచుకునేందుకు ప్రయత్నించి, ఆస్పత్రి పాలయ్యాడు. మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన 8 ఇంచుల ఫిరంగి గుండును తన పురీషనాళంలో వృద్ధుడు చొప్పించుకుని నరకయాతన అనుభవించాడు. చేసేదేమీ లేక ఫ్రాన్స్‌లోని ఓ ఆస్పత్రికి డిసెంబర్ 17న రాత్రి సమయంలో వెళ్లాడు.
రాత్రి 9 గంటల నుంచి 11:30 గంటల మధ్య ఆ వృద్ధుడిని వైద్యులు పరిశీలించారు. అనంతరం శస్త్ర చికిత్స నిర్వహించి ఫిరంగి గుండును తొలగించారు. ఇక సర్జరీ చేస్తున్న సమయంలో ఆ బాంబు పేలితే ప్రమాదమని భావించిన వైద్యులు, ముందస్తు జాగ్రత్తగా బాంబు స్క్వాడ్ సిబ్బందిని ఆస్పత్రికి పిలిపించారు. అయితే మానవ శరీరంలో ఉన్నసమయంలో బాంబు పేలేందుకు అవకాశం తక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు. వృద్ధుడు చేసిన పనికి అటు వైద్యులు, ఇటు పోలీసులు షాక్ అయ్యారు. బాధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
గతేడాది కూడా బ్రిటన్‌లో ఓ వ్యక్తి ఇలాంటి ఘటనకే పాల్పడ్డాడు. రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన ఫిరంగి గుండును పాయువులో చొప్పించుకున్నాడు. బ్రిటన్‌లోని రాయల్ హాస్పిటల్ వైద్యులు అతనికి శస్త్ర చికిత్స చేసి బాంబును తొలగించారు. అనంతరం అతన్ని డిశ్చార్జి చేశారు.