IndiGo flight | ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. అత్యవసరంగా ప్రయాణికుల దించివేత

IndiGo flight | దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశలోని వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. దాంతో వెంటనే అప్రమత్తమైన ఇండిగో సిబ్బంది అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణికులను దించేశారు. ఆ విమానంలో ఎక్కిన ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

IndiGo flight | ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. అత్యవసరంగా ప్రయాణికుల దించివేత

IndiGo flight : దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశలోని వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. దాంతో వెంటనే అప్రమత్తమైన ఇండిగో సిబ్బంది అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణికులను దించేశారు. ఆ విమానంలో ఎక్కిన ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇండిగో విమానం మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసికి బయలుదేరాల్సి ఉంది. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలోనే బాత్రూమ్‌లో ఓ టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేశారు.

అనంతరం ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్‌ సిబ్బంది విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, విమానంలో నిజంగానే బాంబు ఉందా.. లేదంటే ఎవరైనా ఆకతాయిలు భయపెట్టడానికి ఇలాంటి పనిచేశారా..? అనే కాసేపట్లో తేలనుంది.