Wanaparthy | కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీజిల్, పెట్రోల్‌తో దాడికి యత్నం 

వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై సొంత పార్టీ వారే పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించడం సంచలనం రేపింది

Wanaparthy | కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీజిల్, పెట్రోల్‌తో దాడికి యత్నం 

పార్టీలో చేరికల, చర్చల పేరిట  ఎమ్మెల్యే దగ్గర కు వచ్చిన చిన్నారెడ్డి  వర్గీయులు. 
ఇరు వర్గాల మధ్య పెరిగిన మాటల యుద్ధం. 
వెంట తెచ్చుకున్న పెట్రోల్, డిజీల్ తో దాడి కి ప్రయత్నం. 
అడ్డుకున్న ఎమ్మెల్యే గన్ మేన్లు, కార్యకర్తలు..
తృటిలో తప్పిన పెను ప్రమాదం. 

విధాత వనపర్తి బ్యూరో: కాంగ్రెస్ పార్టీ లో చేరికల, చర్చల పేరిట ఎమ్మెల్యే దగ్గర కు వచ్చిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి వర్గయులు ఎమ్మెల్యే మేఘారెడ్డి పై పెట్రోల్, డిజీల్ పోసి దాడి చేసే యత్నం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. గురువారం ఉదయం చిన్నారెడ్డి వర్గయులు తిరుమల అపార్ట్ మెంట్ లో ఉన్న  ఎమ్మెల్యే మేఘారెడ్డి దగ్గర కు వెళ్ళారు. చిన్నారెడ్డి అనుచర వర్గీయుడు  తాటిపర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గణేష్ గౌడు మరి కొందరు ఎమ్మెల్యే తో పార్టీ లో చేరికల పట్ల చర్చ లేవనెత్తారు. తాటిపర్తి కి చెందిన బీఆర్ ఎస్ నాయకులను   కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోవద్దని గణేష్ గౌడు ఎమ్మెల్యే దృష్టి కి తెచ్చారు.

అందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి సమాదానం ఇస్తూ  తాను ఎప్పుడు చేరికలను ప్రోత్సహించా లేదన్నారు,  ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత  పట్టణంలో ని రాజీవ్ చౌరస్తా లో  జరిగిన విజయోత్సవ ర్యాలీ లో కొత్తగా ఎవరిని పార్టీ లో చేర్ఛుకోనని ప్రకటించిన్నట్లు ఆయన వారికి గుర్తు చేశారు.అయితే,  వనపర్తి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ల నాయకులను కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోవడానికి తెరలేపింది  చిన్నారెడ్డి కాదా .! ఆయనను మీరెందకు ప్రశ్నించడం లేదని ఎమ్మెల్యే వారిని అడిగారు. వారు సరైనా సమాదానం చెప్పకుండా దాట వేస్తూ  సమస్య ను మరింతా  జఠిలం చేసే ప్రయత్నం చేశారు.

చిన్నారెడ్డి వర్గయులు ఆవేశంతో ఎమ్మెల్యే వర్గీయులపై మాటల యుద్దానికి దిగారు.అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత నచ్చ చెప్పిన వినలేదు . ప్రతి సారి ఎమ్మెల్యే ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఎమ్మెల్యే వర్గీయులతో  ఘర్షణ కు దిగారు. అయిన   ఎమ్మెల్యే  సామరాస్యంగా మాట్లా డుకుందామని  ఎంత  నచ్చ చెప్పిన వారు వినలేదు. కనీసం  ఎమ్మెల్యే మాటను  చెవున పేట్టలేదు. చిన్నారెడ్డి వర్గయులు ఆవేశంతో  అందురు ఒక్క సారి గా లేచి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు.

వెంటనే  ఒక పథకం ప్రకారం వారి వెంట తెచ్చుకున్న డిజీల్, పెట్రోల్ ను ఒంటిపై పోసుకుని చిలకరించారు. పక్కన్నే ఉన్న ఎమ్మెల్యే దుస్తులు   పెట్రోల్, డిజీల్ తో  తడిపోయాయి. అక్కడే ఎమ్మెల్యే  గన్ మేన్లు వెంటనే అప్రమతమై గణేష్ గౌడు ను అయన అనుచరులను పక్కకు తీసుకపోయారు. ఆ పరిస్థితిలో ఎవరైనా నిప్పు రాజేసింటే జరగరాని నష్టం  జరిగేదని అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు  పోలీసు లకు సమాఛారం ఇవ్వడంతో రూరల్ ఎస్ఐ జలందర్ రెడ్డి తన సిబ్బందితో  తిరుమల అపార్ట్ మెంట్ కు చేరుకున్నారు.

చర్చల పేరిట  అఘాత్యానికి పాల్పఢ్డా గణేష్ గౌడు, మరి కొందరి ని పోలీసు లు అదపు లోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. జరిగిన సంఘటనను పోలీసులు ఎమ్మెల్యే మేఘారెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. అయితే, ఎమ్మెల్యే మేఘారెడ్డి దగ్గరకు రాక ముందే చిన్నారెడ్డి తో  చర్చలు జరిపి ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన్నట్లు విశ్వాసనీయ వర్గీయుల ద్వారా తెలిసింది.

చర్చలకే వస్తే.. డిజీల్, పెట్రోల్ ఎందుకు తెచ్చిన్నట్లు.!?

వాస్తవికంగా ఎమ్మెల్యే దగ్గరకు చర్చలకు వస్తే చిన్నారెడ్డి వర్గీయులు వారి వెంట ఢిజీల్, పెట్రోల్ ఎందుకు తెచ్చుకున్నట్ల అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లో చేరికలకు తెరలేపింది చిన్నారెడ్డి అని తెలిసి ఎమ్మెల్యే దగ్గరకు చర్చల కు ఎందుకొచ్చిన్నట్లని   పలువురు చర్చించుకుంటున్నారు.  పార్లమెంటు ఎన్నికల ముందు చిన్నారెడ్డి వర్గయులు  సంచలనాని కుట్ర చేశారని పలువురు ప్రశ్నించుకుంటున్నారు.

అదే విధంగా  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల దృష్టి లో పడెందుకే ఈ దారుణ సంఘటనకు పూనుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుచున్నారు. ఏది ఏమైనా ఈలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ప్రజాస్వామిక పద్దతి కాదంటున్నారు.  చిన్నారెడ్డి వర్గయులు  చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు హెచ్చరించారు. అదే విధంగా ఈలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు లు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను.