రూ.18 కోట్ల రుణం ఎగవేత: BJP నేతలు రాణి రుద్రమ, జిట్టాల ఆస్తుల వేలం?

విధాత: తెలంగాణ ఉద్యమంలో చురుకైన భూమిక పోషించిన ప్రస్తుత బీజేపీ రాష్ట్ర నాయకులు రాణి రుద్రమ, జిట్ట బాలకృష్ణ రెడ్డిలు 18 కోట్ల బ్యాంకు రుణ ఎగవేత వివాదంలో చిక్కుకున్నారు. వారిద్దరూ లక్ష్మీ విలాస్ బ్యాంకులో 18 కోట్లకు పైగా లోన్ తీసుకున్నారు. అయితే రాజకీయ ఆర్థిక కారణాల నేపథ్యంలో వారిద్దరూ కలిసి చేసిన వ్యాపారాల్లో భారీ నష్టాలు ఎదుర్కోవడంతో ఆర్థికంగా నష్టపోయి తీసుకున్న బ్యాంకు అప్పును తిరిగి చెల్లించడంలో విఫలమై ఎగవేతదారులుగా మిగిలిపోయారు. దీంతో లక్ష్మీ […]

  • By: krs    latest    Feb 10, 2023 10:04 AM IST
రూ.18 కోట్ల రుణం ఎగవేత: BJP నేతలు రాణి రుద్రమ, జిట్టాల ఆస్తుల వేలం?

విధాత: తెలంగాణ ఉద్యమంలో చురుకైన భూమిక పోషించిన ప్రస్తుత బీజేపీ రాష్ట్ర నాయకులు రాణి రుద్రమ, జిట్ట బాలకృష్ణ రెడ్డిలు 18 కోట్ల బ్యాంకు రుణ ఎగవేత వివాదంలో చిక్కుకున్నారు. వారిద్దరూ లక్ష్మీ విలాస్ బ్యాంకులో 18 కోట్లకు పైగా లోన్ తీసుకున్నారు.

అయితే రాజకీయ ఆర్థిక కారణాల నేపథ్యంలో వారిద్దరూ కలిసి చేసిన వ్యాపారాల్లో భారీ నష్టాలు ఎదుర్కోవడంతో ఆర్థికంగా నష్టపోయి తీసుకున్న బ్యాంకు అప్పును తిరిగి చెల్లించడంలో విఫలమై ఎగవేతదారులుగా మిగిలిపోయారు.

దీంతో లక్ష్మీ విలాస్ బ్యాంక్ రుణ రికవరీలో భాగంగా సెక్యూరిటీ క్రెడిటర్ రిలయన్స్ అస్సేట్ రీ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ రుద్రమ, జిట్టల ఆస్తుల వేలంకు పత్రికా ప్రకటనలు జారీ చేసింది. మన్సూరాబాద్ , రాక్ టౌన్, తట్టిఅన్నారం, అల్కాపురి, భువనగిరి ప్రాంతాల్లోని వారి ఆస్తులను వేలం వేయనుంది.