అవతార్ 2.. సినిమా అంటే నేరం: వర్మ!
విధాత: రాంగోపాల్ వర్మ.. ఈ పేరులోనే అసలు తిక్క ఉంది. ఆయన చేసే వ్యాఖ్యలు, పొగడ్తలు అన్నీ వెరైటీగా ఉంటాయి. కొంతమందికి ఆయన చేసే వ్యాఖ్యలు పొగడ్తలు అనిపించవచ్చు. మరి కొందరికి సెటైర్లు పొగడ్తలుగా అనిపించవచ్చు. ఇంకొందరికి పొగడ్తలు తిట్లలా అనిపించవచ్చు. అది ఆయన తప్పు కాదు. అది ఆయన నైజం.. లోతైన భావం. ఇక ఆయన తాజాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ విడుదలైన ‘అవతార్ 2’ మూవీపై తనదైన […]

విధాత: రాంగోపాల్ వర్మ.. ఈ పేరులోనే అసలు తిక్క ఉంది. ఆయన చేసే వ్యాఖ్యలు, పొగడ్తలు అన్నీ వెరైటీగా ఉంటాయి. కొంతమందికి ఆయన చేసే వ్యాఖ్యలు పొగడ్తలు అనిపించవచ్చు. మరి కొందరికి సెటైర్లు పొగడ్తలుగా అనిపించవచ్చు. ఇంకొందరికి పొగడ్తలు తిట్లలా అనిపించవచ్చు. అది ఆయన తప్పు కాదు. అది ఆయన నైజం.. లోతైన భావం.
ఇక ఆయన తాజాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ విడుదలైన ‘అవతార్ 2’ మూవీపై తనదైన తరహాలో రివ్యూ ఇచ్చి పారేశాడు. నిజానికి ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది.
SWAM in Avatar 2 once again ..it is an ORGY of MAGNIFIQUE visuals , SPELLBINDING performances and BREATHTAKING action ..GOD created earth and James Cameron created PANDORA and I’d rather live in the latter
— Ram Gopal Varma (@RGVzoomin) December 18, 2022
కానీ కొందరికి మాత్రం ఇది డాక్యుమెంటరీగా అనిపిస్తుంది. ఎవరి అభిప్రాయం వారిది. సామాన్య ప్రేక్షకులైతే తమను ఈ చిత్రం మరో లోకంలో విహరింప చేసిందని అంటున్నారు. చూసిన వాళ్ళందరూ సోషల్ మీడియా వేదికగా వాళ్ల స్పందన తెలియజేస్తున్నారు.
ఇంతకీ వర్మ ట్విట్టర్ వేదికగా సినిమా గురించి నెటిజన్లతో ఏమన్నాడంటే.. ఇప్పుడే ‘అవతార్ 2’లో స్నానం చేసి వచ్చాను. దీన్ని సినిమా అనడం నేరంతో సమానం. ఎందుకంటే అద్భుతమైన విజువల్స్‌తో, అబ్బురపరిచే యాక్షన్ సీన్స్‌తో జీవిత కాలానికి సరిపోయే అనుభూతిని అవతార్ 2 నాకు అందించింది.
మరో లోకంలో విహరించినట్లుగా ఉంది.. అని వర్మ ట్వీట్ చేశాడు. ఇక అవతార్ మొదటి భాగంలో పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్ కామెరూన్.. రెండో భాగంలో ప్రేక్షకులను సముద్ర గర్భంలోకి తీసుకొని వెళ్ళాడు.
After seeing AVATAR 2 , if somebody can assure that heaven will look anywhere like PANDORA the entire human species will DIE immediately
— Ram Gopal Varma (@RGVzoomin) December 18, 2022