పఠాన్ దెబ్బకి ‘బాహుబలి’ అవుట్.. RRRతో పోటీ!
బాహుబలికి ధీటుగా పఠాన్ RRRను కూడా టార్గెట్ చేస్తుందని టాక్ విధాత: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ తన పూర్వవైభవాన్ని చాటుకుంటున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ‘పఠాన్’తో బాక్సాఫీస్‌పై దండెత్తాడు. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తుంది. ఈ సినిమా ఎంతటి బాక్సాఫీస్ రేంజి బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. జీరో వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత సుమారు నాలుగేళ్ల […]

- బాహుబలికి ధీటుగా పఠాన్
- RRRను కూడా టార్గెట్ చేస్తుందని టాక్
విధాత: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ తన పూర్వవైభవాన్ని చాటుకుంటున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ‘పఠాన్’తో బాక్సాఫీస్‌పై దండెత్తాడు. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తుంది. ఈ సినిమా ఎంతటి బాక్సాఫీస్ రేంజి బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. జీరో వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత సుమారు నాలుగేళ్ల పాటు విరామం తీసుకుని షారుఖ్ ఈ చిత్రాన్ని చేశాడు.
వాస్తవానికి ఆయనకు దశాబ్ద కాలంగా సరైన హిట్టు లేదు. అలాంటి షారూఖ్ ఖాన్ యాక్షన్ జోనర్ మూవీ అంటే పిచ్చెక్కిపోయే బాలీవుడ్ ఆడియన్స్‌కు.. అదే జానర్‌తో కిక్కిచ్చాడు. ఈ చిత్రం టీజర్ ట్రైలర్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. మొదటి రోజే 58కోట్ల నెట్టు వసూలు సాధించి ఆల్ టైం డే వన్ రికార్డు నెలకొల్పింది.
ఆ తర్వాత లాంగ్ వీకెండ్ లోపే 500 కోట్ల రూపాయల మార్కును అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా 20 రోజులుగా అన్ని భాషల్లో కలిపి 500 కోట్ల రూపాయల నెట్టు వసూళ్లను రాబట్టినట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ ప్రభంజనం చూసి బాలీవుడ్ ట్రేడ్ పండితులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు హిందీ సినిమాలలో 500 కోట్ల రూపాయల నెట్టుని వసూలు చేసిన ఏకైక సినిమా ‘బాహుబలి 2’ మాత్రమే. ఆ చిత్రం తర్వాత ఆ మార్కుని అందుకున్న ఏకైక సినిమా ‘పఠాన్’ చిత్రమే కావడం విశేషం. ఇలా నెట్టు వసూళ్ల పరంగా సంచలనం సృష్టించిన పఠాన్ గ్రాస్ వసూళ్ల పరంగా చూసుకుంటే అలా కూడా సంచలనం సృష్టించింది.
1000 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్బులోకి అడుగు పెట్టింది. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో బాహుబలి 2, కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి షారుక్ పఠాన్ చేరిందని బాలీవుడ్‌లో మోత మోగుతోంది.. రాబోయే రోజుల్లో ఈ సినిమా RRR కలెక్షన్స్ కూడా టార్గెట్ చేయనుందనేలా అక్కడ టాక్ వినబడుతోంది.