Babu Mohan | బీజేపీకి బాబుమోహన్‌ రాజీనామా

బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాని మాజీ మంత్రి, సినీ నటుడు బాబూమోహన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు

  • By: Somu    latest    Feb 07, 2024 10:35 AM IST
Babu Mohan | బీజేపీకి బాబుమోహన్‌ రాజీనామా
  • కిషన్‌రెడ్డిపై ఆగ్రహం

Babu Mohan | విధాత, హైదరాబాద్‌ : బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాని మాజీ మంత్రి, సినీ నటుడు బాబూమోహన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో కిషన్‌రెడ్డి వైఖరితో విసిగేత్తిపోయినట్లుగా తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ జిల్లా నుండి పోటీ చేస్తానన్నారు. ఏ పార్టీలో చేరుతారన్నది ప్రకటించలేదు. పార్టీ వైఖరి నా కుటుంబంలో చిచ్చు పెట్టేదిగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి నన్ను దూరం పెడుతూ, కనీసం నా ఫోన్ కూడా ఎత్తకుండా బీజేపీలోని కొందరు నాయకులు నన్ను ఇబ్బంది పెడుతున్నారని బాబుమోహన్‌ ఆరోపించారు.


అందుకే బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇదిలాఉంటే బాబూ మోహన్ ఆందోల్ నియోజకవర్గం నుంచి 2018, 2023లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేశారు. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు బాబు మోహన్ ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ టికెట్ బాబూ మోహన్ కు ఇచ్చేందుకు కమలనాథులు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో బాబూ మోహన్ బీజేపీకి రాజీనామా చేశారని సమాచారం.