Balagam: ఓటీటీ రైట్స్‌లోనూ ‘బలగం’ రికార్డ్.. ఇది చిన్న సినిమా కానే కాదు

Balagam, OTT విధాత‌: కమెడియన్ వేణు (Comedian Venu) దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా ‘బలగం’ (Balagam). దిల్ రాజు (Dil Raju) తన కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో తక్కువ బడ్జెట్‌లోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని డీసెంట్ కలెక్షన్స్‌తో దూసుకు పోతోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్క‌రించారంటూ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శకుల […]

  • Publish Date - March 8, 2023 / 03:20 AM IST

Balagam, OTT

విధాత‌: కమెడియన్ వేణు (Comedian Venu) దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా ‘బలగం’ (Balagam). దిల్ రాజు (Dil Raju) తన కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో తక్కువ బడ్జెట్‌లోనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని డీసెంట్ కలెక్షన్స్‌తో దూసుకు పోతోంది.

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్క‌రించారంటూ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా థియేటర్స్‌లో సామాన్య ప్రేక్ష‌కుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీతో దిల్ రాజు కూతురు హర్షితా రెడ్డి నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

ఇదిలా ఉంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన కథాంశంతో వచ్చి సక్సెస్ అందుకున్న చిన్న సినిమాగా ఈ మూవీ నిలిచింది. ఇక సినిమా సక్సెస్‌తో కమెడియన్ వేణుకి దిల్‌రాజు ద‌ర్శకుడిగా మరో అవకాశం ఇచ్చాడు.

ఇక ‘బలగం’ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. మూవీకి మంచి టాక్ రావడంతో ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసి అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మొదట ఆహా పోటీ పడినట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఫైనల్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఈ సినిమాను దక్కించుకుంది. దీంతో ఈ మధ్య కాలంలో చిన్న చిత్రాలలో ఎక్కువ ధరకి డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయిన సినిమాగా ‘బలగం’ నిలిచింది అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రచ్చ రవి, వేణులు కూడా కీల‌క‌పాత్ర‌ల‌ను పోషించారు.

Latest News