తిరువనంతపురం : ఇద్దరు యువకుల అకౌంట్లలో ఏకంగా రూ.2.44 కోట్లు పొరపాటున బ్యాంకు నుంచి జమయ్యాయి. అయితే, డబ్బునంతా యువకులు విలాసాలకు ఖర్చు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో జరగ్గా.. అరింబూర్కు నిధిన్, మను అనే ఇద్దరిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నిందితులు డబ్బుతో ఖరీదైన ఫోన్లు, వస్తువులను కొనుగోలు చేశారు. అందులో నుంచి కొంత మొత్తాన్ని లోన్లు కట్టేందుకు, మిగతా సొత్తును షేర్ మార్కెట్లు పెట్టుబడికి వాడుకున్నారు. ఇంకా మిగిలిన అకౌంట్లో సొత్తును 19 వేర్వేరు బ్యాంకుల్లోని 54 ఖాతాలకు బదిలీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, బ్యాంక్ నుంచి డబ్బులు వేరే అకౌంట్లోకి వెళ్లాయని గుర్తించిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులకు అకౌంట్ ఉన్న బ్యాంక్ మరో బ్యాంక్‌లో విలీనం కావడం వల్ల.. సాంకేతిక సమస్యలతో వారి ఖాతాల్లో జమైనట్లు అధికారులు గ్తుించారు. బ్యాంకు సర్వర్లను తారుమారు చేసి, డబ్బులు స్వాహా చేశారనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పొరపాటున యువకుల అకౌంట్లలో రూ.2.44కోట్లు.. సొత్తంతా జల్సాలకు ఖర్చు..!
<p>తిరువనంతపురం : ఇద్దరు యువకుల అకౌంట్లలో ఏకంగా రూ.2.44 కోట్లు పొరపాటున బ్యాంకు నుంచి జమయ్యాయి. అయితే, డబ్బునంతా యువకులు విలాసాలకు ఖర్చు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో జరగ్గా.. అరింబూర్కు నిధిన్, మను అనే ఇద్దరిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నిందితులు డబ్బుతో ఖరీదైన ఫోన్లు, వస్తువులను కొనుగోలు చేశారు. అందులో నుంచి కొంత మొత్తాన్ని లోన్లు కట్టేందుకు, మిగతా సొత్తును షేర్ […]</p>
Latest News

తెలంగాణలో సర్(SIR) గడువు పెంపు
మమత ముస్లిం రిజర్వేషన్లకు మంగళం
రామరావణులుగా మహేశ్ బాబు, తారక్ లు..ఏఐ రామాయణ ట్రైలర్ వైరల్ !
జయలలిత బంగ్లాను కొనుగోలు చేయనున్న సీఎం విజయ్ !?
సీఎం విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !
“తెలంగాణ రైజింగ్-2047” లక్ష్యం..ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి
సైకిల్‌పై కేదార్నాథ్ కు సాహస యాత్ర..తోడుగా కుక్క!
దేశ పురోగతి మార్గం..నదుల అనుసంధానం : సీఎం చంద్రబాబు
అమెరికాతో పీస్ డీల్ కు ఇరాన్ గుడ్ బై!
ఏపీలో ముద్రగడ మరణంపై రాజకీయ సెగలు !