Beema policy | బీమా పాలసీల సరెండర్ వాల్యూ రూల్స్‌కు సవరణ.. IRDAI కొత్త నిబంధనలు ఇవే..!
Beema policy : బీమా పాలసీల సరెండర్ వాల్యూకు సంబంధించి ‘బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI)’ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ న్యూ రూల్స్ ప్రకారం.. మూడేళ్ల కాల వ్యవధిలోపు బీమా పాలసీలను సరెండర్ చేస్తే.. వాటి విలువ యథాతథంగా లేదా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 4 నుంచి 7 ఏళ్ల మధ్య బీమా పాలసీలను సరెండర్ చేస్తే వాటి విలువ స్వల్పంగా పెరుగుతుంది.
మెచ్యూరిటీ తేదీ కంటే ముందే పాలసీదారుడు బీమా పాలసీలను ఉపసంహరించుకుంటే.. పాలసీదారుడికి బీమా కంపెనీలు చెల్లించే మొత్తాన్ని సరెండర్ విలువగా పరిగణిస్తారు. ఇలా పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారుడు తన బీమా పాలసీని సరెండర్ చేస్తే.. అప్పటిదాకా పాలసీదారుడు చెల్లించిన మొత్తం.. ఆ మొత్తంపై వచ్చిన ఆదాయాన్ని చెల్లిస్తారు.
కొత్త నిబంధనల ప్రకారం పాలసీదారుడు తన బీమా పాలసీని ఎంత తక్కువ వ్యవధిలో సరెండర్ చేస్తే అంత తక్కువ విలువను సరెండర్ వాల్యూగా పొందుతాడు. అదేవిధంగా పాలసీదారుడు ఎంత ఎక్కువ కాలం తన పాలసీని కొనసాగిస్తే అంత ఎక్కువగా సరెండర్ వాల్యూ వస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram