Bellamkonda Sai Sreenivas | ‘బెల్లంకొండ’ ప్రపంచ రికార్డు.. సాయి శ్రీనివాస్‌ రీమేక్‌ సినిమాకు 710 మిలియన్‌ వ్యూస్‌..!

Bellamkonda Sai Sreenivas | విధాత: బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తెలుగులో వచ్చిన ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని హిందీలోకి డబ్‌ చేయగా.. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో ప్రపంచ రికార్డును సృష్టించింది. ‘ఖూన్ఖర్‌’ పేరుతో డబ్‌ చేసిన ఈ చిత్రానికి ఇప్పటివరకు 710 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ వచ్చాయి. యూట్యూబ్‌లో ఇప్పటివరకు ఏ హీరోకి రాని విధంగా అత్యధికంగా వ్యూస్‌ వచ్చిన చిత్రంగా ఇది ఘనత సాధించింది. అయితే తెలుగులో ఇంత స్పందన […]

Bellamkonda Sai Sreenivas | ‘బెల్లంకొండ’ ప్రపంచ రికార్డు.. సాయి శ్రీనివాస్‌ రీమేక్‌ సినిమాకు 710 మిలియన్‌ వ్యూస్‌..!

Bellamkonda Sai Sreenivas |

విధాత: బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తెలుగులో వచ్చిన ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని హిందీలోకి డబ్‌ చేయగా.. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో ప్రపంచ రికార్డును సృష్టించింది. ‘ఖూన్ఖర్‌’ పేరుతో డబ్‌ చేసిన ఈ చిత్రానికి ఇప్పటివరకు 710 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ వచ్చాయి. యూట్యూబ్‌లో ఇప్పటివరకు ఏ హీరోకి రాని విధంగా అత్యధికంగా వ్యూస్‌ వచ్చిన చిత్రంగా ఇది ఘనత సాధించింది. అయితే తెలుగులో ఇంత స్పందన రాకపోవడం విశేషం.

ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జయ జానకి నాయక’ 2017 ఆగస్టులో విడుదలైంది. ఈ సినిమా విజయం సాధించడంతో నాలుగేళ్ల క్రితం పెన్ మూవీస్ సంస్థ హిందీలోకి డబ్‌ చేసి.. యూట్యూబ్‌లో విడుదల చేయగా ఈ యాక్షన్ మూవీని హిందీ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు.

బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్: చాప్టర్-2 సినిమా 702 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఇంతకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన ‘సీత’, ‘కవచం’, ‘సాక్ష్యం’, ‘స్పీడున్నోడు’ తదితర సినిమాలు సైతం హిందీ డబ్‌ చిత్రాలకు యూట్యూబ్‌లో వందల మిలియన్లలో వ్యూస్‌ ఉన్నాయి. తేజ దర్శకత్వంలో శ్రీనివాస్‌, కాజోల్‌ కాంబినేషన్‌లో వచ్చిన సీత చిత్రాన్ని కూడా సీతారామ్‌గా హిందీలోకి అనువదించి విడుదల చేయగా అది కూడా 600 మిలియన్స్‌ వ్యూస్‌ దిశగా దూసుకుపోతున్నది.

ఇదిలా ఉండగా.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమానే వీవీ వినాయక్‌ దర్శకత్వంలో సమంత లాంటి స్టార్ హీరోయిన్‌తో జత కట్టాడు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా కలిసిరాలేదు.

తాజాగా హిందీలో తనకున్న ఫేమ్‌ను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. ప్రభాస్‌ తెలుగులో నటించిన ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో రిమేక్‌ చేస్తూ శ్రీనివాస్‌ హీరోగా అడుగుపెట్టబోతున్నాడు.

ఈ సినిమాకు వీవీ వినాయక్‌ దర్శకత్వం వహించారు. మే 12న ఈ చిత్రం హిందీలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.