Bengaluru | బెంగళూరు సీఈవో, ఎండీ జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్
Bengaluru చెడ్డవారినే శిక్షిస్తానంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టిన నిందితుడు హత్యల బ్రేకింగ్ న్యూస్ ఇన్‌స్టాలో పోస్టు విధాత: సంచలనం సృష్టించిన బెంగుళూరు జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్యలతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ముగ్గురు అనుమానితులను హత్య జరిగిన 24 గంటలలోపే అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన నిందితుడు శబరీష్ అలియాస్ జాక్ ఫిలిక్స్ సినిమా స్టైల్లో స్టేటస్ పెట్టి మరీ హత్య చేశారు. […]

Bengaluru
- చెడ్డవారినే శిక్షిస్తానంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టిన నిందితుడు
- హత్యల బ్రేకింగ్ న్యూస్ ఇన్‌స్టాలో పోస్టు
విధాత: సంచలనం సృష్టించిన బెంగుళూరు జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్యలతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ముగ్గురు అనుమానితులను హత్య జరిగిన 24 గంటలలోపే అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన నిందితుడు శబరీష్ అలియాస్ జాక్ ఫిలిక్స్ సినిమా స్టైల్లో స్టేటస్ పెట్టి మరీ హత్య చేశారు.
కంపెనీనుంచి బయటకు వెళ్లి, తన బిజినెస్‌కు ఇబ్బందిగా మారిన చెడ్డవారిని శిక్షిస్తానంటూ…”ఈ ప్రపంచం మొత్తం మోసగాళ్లు, కపట పొగడ్తలతో ముంచెత్తేవారితో నిండిపోయింది. నేను ఈ భూమిపైనే వారిని శిక్షిస్తాను. మంచివారిని ఎప్పుడూ ఏమీ చేయను” అంటూ వాట్సాప్ స్టేషన్ పెట్టిన విషయం దర్యాప్తులో వెలుగుచూసింది.
కాగా.. తనను తాను కన్నడ ర్యాపర్‌గా చెప్పుకునే ఫిలిక్స్‌కు ఇన్‌స్టా గ్రామ్‌లో 16 వేల మంది ఫాలోయిర్స్ ఉన్నారు. హత్యల అనంతరం, ఆ హత్యలతో ఫిలిక్స్‌కు సంబంధం ఉందంటూ టీవీ ఛానళ్లలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్‌ను కూడా ఇన్‌స్టాలో పోస్టు చేయడంలో బిజీగా గడిపినట్లు అమృతహల్లి పోలీసులు గుర్తించారు.
ఫైబర్ నెట్ కంపెనీ ఎయిరోనిక్స్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ ఎండీ ఫణీంద్ర సుబ్రహ్మణ్యం, సీఈవో వినుకుమార్‌లలు గతంలో జీనెట్‌లో పనిచేశారు. వీరు బయటకు వెళ్లి తన వ్యాపారానికి ఇబ్బందిగా మారారనే కారణంగానే హత్య చేసినట్లు తేలింది. శబరీష్ (27) అలియాస్ జాక్ ఫిలిక్స్, సంతోష్ (26) అలియాస్ సంత, వినయ్ రెడ్డి (23) లు ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు. వీరిని బెంగుళూరులోని ఎస్‌కెఎన్ లాడ్జిలో అదుపులోకి తీసుకున్నారు.
హత్య జరిగిన ప్రదేశం నుంచి వీరు పారిపోయి కారులో మెజెస్టిక్ చేరుకున్నారని, మెజెస్టిక్‌లో కుణిగల్‌కు రైలు ఎక్కినట్లు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని అనుసరించి ఇతర వివరాలను ట్రాక్ చేసి వారిని పట్టుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
ముగ్గురూ నేరం చేసినట్లు నిరూపించడానికి అవసరమైన వీడియో సాక్ష్యాలు కూడా పోలీసులు సేకరించినట్లు చెప్పారు. హంతకులు ఫణీంద్ర శరీరంపై అనేకసార్లు కత్తితో పొడిచారు. విను కుమార్ తల రెండుగా చీలిపోయింది కూడా. ఏరోనిక్స్‌కు, జినెట్ బ్రాడ్‌బ్యాండ్‌కు మధ్య ఆధిపత్య పోరులో ఈ జంట హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ రెండు కంపెనీల మధ్య ఎప్పటినుంచో మాటల యుద్ధం జరుగుతోందని, హత్యకు గురైన ఫణీంద్ర, వినుకుమార్‌లు కూడా గతంలో జీనెట్‌లో పనిచేశారని తెలిపారు. జీనెట్‌లో బయటకొచ్చి వీరిద్దరూ ఎయిరోనిక్స్‌ను స్థాపించారు. ఎయిరోనిక్స్‌ను ప్రారంభించినప్పటి నుండి, చాలా మంది వినియోగదారులు ఎయిర్ ఆన్‌కి మారారు. ఈ హత్యలతో సంబంధమున్న మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.