Bhatti Vikramarka | తక్షణమే పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయాలి: సీఎం కేసీఆర్‌కు భట్టి బహిరంగ లేఖ

కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవిపై గిరిజనులకే హక్కులు గిరిజనుల హక్కులను కాల రాయడం క్షమించరాని నేరం పోడు భూముల సమస్యపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రం విడుదల చేస్తుంది. 4లక్షల మంది పట్టాల కోసం చూస్తుంటే, లక్షా 50 వేల మందికి ఇస్తాననడం విడ్డూరం పోడులకు దరఖాస్తుల జాబితా గ్రామాలు ,మండలాలు జిల్లాల, వారీగా విడుదల చేయాలి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన సీఎల్పీ నేత […]

  • By: Somu |    latest |    Published on : Apr 03, 2023 2:21 AM IST
Bhatti Vikramarka | తక్షణమే పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయాలి: సీఎం కేసీఆర్‌కు భట్టి బహిరంగ లేఖ
  • కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవిపై గిరిజనులకే హక్కులు
  • గిరిజనుల హక్కులను కాల రాయడం క్షమించరాని నేరం
  • పోడు భూముల సమస్యపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
  • లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రం విడుదల చేస్తుంది.
  • 4లక్షల మంది పట్టాల కోసం చూస్తుంటే, లక్షా 50 వేల మందికి ఇస్తాననడం విడ్డూరం
  • పోడులకు దరఖాస్తుల జాబితా గ్రామాలు ,మండలాలు జిల్లాల, వారీగా విడుదల చేయాలి
  • సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

విధాత బ్యూరో, కరీంనగర్: ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ తదితర ఉమ్మడి జిల్లాలలో పోడు రైతులకు తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని పోలంపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవిపై, అటవీ ఫలాలపై, పోడు భూములపై గిరిజనులకే హక్కులు ఉన్నాయన్నారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాల రాయడం క్షమించరాని నేరమన్నారు. పోడు భూములపై హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న గిరిజనుల జాబితా గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పోడు భూముల సమస్యపై పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పొడు భూముల సమస్యపై రాష్ట్రప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పోడు రైతులకు ఆ భూములపై హక్కులు కల్పిస్తే, ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి కారణంగా గిరిజనులు తమ భూముల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
2014 నుండి పోటు భూముల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రకటనాలన్నీ నీటి మీద రాతలుగానే మిగిలి పోయాయన్నారు.

2014,2018 సాధారణ ఎన్నికలు, నాగార్జునసాగర్ మునుగోడు ఉప ఎన్నికల్లో ఈ సమస్యను అస్రంగా వాడుకుని, ఆ తరువాత ఈ ఊసే ఎత్తని ప్రభుత్వ వైఖరిని గిరిజనులు గమనిస్తూనే ఉన్నారన్నారు.
2019 మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో పోడు భూములు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అదే సంవత్సరం జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గిరిజనులకు పోడు భూములు ఇచ్చేందుకు తాను స్వయంగా అక్కడే కూర్చి వేసుకుని కూర్చుంటానని, ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

రెండు నెలల క్రితం జరిగిన శాసనసభ సమావేశాల్లో 11.50 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తే, 1,55,393 మందికే మొదటి విడతలో హక్కు పత్రాలు ఇస్తామని ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించడం పోడు భూముల విషయంలో ప్రభుత్వ గందరగోల పరిస్థితికి అర్థం పడుతుందన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది గిరిజనులు పట్టాల కోసం ఎదురు చూస్తుంటే లక్షా 50 వేల మందికి పట్టాలు ఇస్తామనడం వారిని నిలువునా ముంచడమే అన్నారు.