Bihar | లైంగిక‌ దాడి.. రేపిస్ట్ జ‌న‌నాంగాల‌ను కోసేసిన మ‌హిళ‌

Bihar | Crime News | బెదిరింపుల‌కు గురిచేసి లైంగిక దాడికి పాల్ప‌డిన ఓ వ్య‌క్తి జ‌న‌నాంగాల‌ను బాధిత మ‌హిళ కోసేసింది. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని బంకా జిల్లాలో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. బంకా జిల్లాకు చెందిన ఓ మ‌హిళ‌(20) భ‌ర్త‌ శుక్ర‌వారం రాత్రి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. భ‌ర్త బ‌య‌ట‌కు వెళ్ల‌డాన్ని గ‌మ‌నించిన ఓ 27 ఏండ్ల వ్య‌క్తి.. ఆ ఇంట్లోకి ప్ర‌వేశించాడు. మ‌హిళ‌పై బ‌ల‌వంతంగా […]

Bihar | లైంగిక‌ దాడి.. రేపిస్ట్ జ‌న‌నాంగాల‌ను కోసేసిన మ‌హిళ‌

Bihar | Crime News |

బెదిరింపుల‌కు గురిచేసి లైంగిక దాడికి పాల్ప‌డిన ఓ వ్య‌క్తి జ‌న‌నాంగాల‌ను బాధిత మ‌హిళ కోసేసింది. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని బంకా జిల్లాలో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బంకా జిల్లాకు చెందిన ఓ మ‌హిళ‌(20) భ‌ర్త‌ శుక్ర‌వారం రాత్రి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. భ‌ర్త బ‌య‌ట‌కు వెళ్ల‌డాన్ని గ‌మ‌నించిన ఓ 27 ఏండ్ల వ్య‌క్తి.. ఆ ఇంట్లోకి ప్ర‌వేశించాడు. మ‌హిళ‌పై బ‌ల‌వంతంగా అత్యాచారం చేశాడు.

మ‌రోసారి లైంగికదాడికి పాల్ప‌డేందుకు య‌త్నించిన రేపిస్ట్ జ‌న‌నాంగాల‌ను అక్క‌డే ఉన్న షేవింగ్ బ్లేడ్‌తో కోసేసింది. అనంత‌రం అతన్ని త‌ప్పించుకుని, బ‌య‌ట‌కు ప‌రుగెత్తి కేక‌లు వేసింది.

కానీ అంత‌లోపే రేపిస్టు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మొత్తానికి నిందితుడిని అరెస్టు చేశారు. వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం బాధితురాలిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.