Viral Video | బైక్‌ను 12 కి.మీ. మేర ఈడ్చుకెళ్లిన బ‌స్సు.. యువ‌కుడు మృతి

Viral Video | ఓ బ‌స్సు డ్రైవ‌ర్ త‌న విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించాడు. ఓ యువ‌కుడి నిండు ప్రాణాల‌ను బ‌లిగొన్నాడు. యాక్సిడెంట్ అయింద‌ని తెలిసీ కూడా ఆ యువ‌కుడి బైక్‌ను 12 కిలోమీట‌ర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ బ‌స్సు.. రోడ్డుపై అతి వేగంగా వెళ్తుంది. ఎత‌వా వ‌ద్ద మే 19వ తేదీన రాత్రి.. బ‌స్సు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ బ‌స్సు ముందు భాగంలో చిక్కుకుపోయింది. యువ‌కుడు ప్రాణాలు కోల్పోగా, ఆ […]

Viral Video | బైక్‌ను 12 కి.మీ. మేర ఈడ్చుకెళ్లిన బ‌స్సు.. యువ‌కుడు మృతి

Viral Video |

ఓ బ‌స్సు డ్రైవ‌ర్ త‌న విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించాడు. ఓ యువ‌కుడి నిండు ప్రాణాల‌ను బ‌లిగొన్నాడు. యాక్సిడెంట్ అయింద‌ని తెలిసీ కూడా ఆ యువ‌కుడి బైక్‌ను 12 కిలోమీట‌ర్ల మేర ఈడ్చుకెళ్లాడు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ బ‌స్సు.. రోడ్డుపై అతి వేగంగా వెళ్తుంది. ఎత‌వా వ‌ద్ద మే 19వ తేదీన రాత్రి.. బ‌స్సు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ బ‌స్సు ముందు భాగంలో చిక్కుకుపోయింది. యువ‌కుడు ప్రాణాలు కోల్పోగా, ఆ బైక్‌ను బ‌స్సు డ్రైవ‌ర్ 12 కిలోమీట‌ర్ల ఈడ్చుకెళ్లాడు.

అనంత‌రం బ‌స్సు డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.