Biscuits | ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తక్కువ..! వినియోగదారుల కోర్టుకెక్కడంతో ఐటీసీకి రూ.లక్ష జరిమానా..!
Biscuits | చాలా మంది దుకాణాల్లో ఎన్నో వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కొనుగోలు చేసే సమయంలో ఎంత ధర ఉందని మాత్రమే పరిశీలిస్తుంటారు. ఆయా కంపెనీలు ఆయా ఉత్పత్తుల్లో వాడే పదార్థాల వివరాలు, తయారీ తేదీ, గడువు ముగిసే తేదీ తదితర వివరాలన్నీ కవర్లపై ముద్రిస్తుంటారు. కానీ, ఎవరూ సాధారణ పట్టించుకోరు. కేవలం ధర మాత్రమే చూసి కొనుగోలు చేస్తుంటారు. కానీ.. ఓ వ్యక్తి తాను కొనుగోలు చేసిన బిస్కెట్ ప్యాకెట్‌లో ఓ బిస్కెట్ తక్కువ వచ్చిందని.. […]

Biscuits |
చాలా మంది దుకాణాల్లో ఎన్నో వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కొనుగోలు చేసే సమయంలో ఎంత ధర ఉందని మాత్రమే పరిశీలిస్తుంటారు. ఆయా కంపెనీలు ఆయా ఉత్పత్తుల్లో వాడే పదార్థాల వివరాలు, తయారీ తేదీ, గడువు ముగిసే తేదీ తదితర వివరాలన్నీ కవర్లపై ముద్రిస్తుంటారు.
కానీ, ఎవరూ సాధారణ పట్టించుకోరు. కేవలం ధర మాత్రమే చూసి కొనుగోలు చేస్తుంటారు. కానీ.. ఓ వ్యక్తి తాను కొనుగోలు చేసిన బిస్కెట్ ప్యాకెట్‌లో ఓ బిస్కెట్ తక్కువ వచ్చిందని.. వినియోగదారులను కంపెనీ మోసం చేస్తుందంటూ వినియోగదారుల కోర్టుకెక్కాడు. ఈ మేరకు ప్రముఖ కంపెనీ ఐటీసీకి కోర్టు రూ.లక్ష జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళితే..
ఈ ఘటన 2021లో చోటు చేసుకున్నది. చెన్నైలోని ఎంఎండీఏ మాథుర్ ప్రాంతానికి చెందిన పీ ఢిల్లీ బాబు అనే వ్యక్తి స్థానిక స్టోర్‌లో ఐటీసీ కంపెనీ తయారు చేసిన ‘సన్ ఫీస్ట్ మేరీ లైట్’ బిస్కట్ ప్యాకెట్లను కొనుగోలు చేస్తూ వీధి కుక్కలకు వేస్తూ వస్తుంటాడు. ఎప్పటిలాగా బిస్కట్ ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. వాటిని కుక్కలకు వేసే ముందు ప్యాకెట్‌ను పరిశీలించారు.
ప్యాకెట్‌లో 16 బిస్కెట్లు వస్తాయని ప్రింట్ చేసి ఉండగా.. ప్యాకెట్ తెరిచి చూడగా.. 15 బిస్కెట్లు మాత్రమే ఉన్నాయి. దీనిపై స్టోర్ సంప్రదించగా.. సమాధానం రాలేదు. ఆ తర్వాత ఐటీసీ కంపెనీకి మెయిల్ చేసినా చివరకు స్పందన లేకపోవడంతో చెన్నైలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
రూ.లక్ష జరిమానా విధించిన కోర్టు..
అయితే, ఒక్కో ప్యాకెట్‌లో ఒక బిస్కట్‌ను తక్కువగా ప్యాక్ చేయడంతో ఐటీసీ ఏకంగా రూ.29లక్షల మేర మోసం చేస్తుందని కోర్టుకు తెలిపాడు. ‘సన్ ఫీస్ట్ మేరీ లైట్’ బిస్కట్ ప్యాకెట్లో ఒక్కో బిస్కట్ ధర 0.75 ఉంటుందని.. ఐటీసీ రోజుకు 50లక్షల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తుందని. ఈ లెక్కల కంపెనీ ప్రజలను రూ.29లక్షల వరకు మోసానికి పాల్పడుతుందని ఆరోపించాడు.
అయితే, ఈ వాదనలను ఐటీసీ తోసిపుచ్చింది. ప్యాకెట్ బరువును మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని, అందులోని బిస్కెట్ల బరువును కాదని చెప్పింది. ప్యాక్ కవర్‌పై ఉన్న విధంగానే బిస్కెట్ల బరువు ఉందని ఐటీసీ వాదించింది.
అయితే, కోర్టు మాత్రం ఢిల్లీ బాబు వాదనలను పరిగణలోకి తీసుకొని రూ.లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని ఢిల్లీ బాబుకు చెల్లించడంతో పాటు తక్కువ బిస్కెట్లు వచ్చిన బ్యాచ్ ప్యాక్ అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించింది.