Secunderabad: మోదీ పర్యటనలో CS, DGPలకు చేదు అనుభవం

విధాత: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్‌లకు చేదు అనుభవం ఎదురైంది. రెండు సెకన్ల నిడివిగల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి మోదీ రాక సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీకుమార్ అక్కడికి వచ్చారు. ప్రధాన వేదిక వద్దకు వస్తున్న సమయంలోనో లేదా వెళ్లే సమయంలోనో […]

Secunderabad: మోదీ పర్యటనలో CS, DGPలకు చేదు అనుభవం

విధాత: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్‌లకు చేదు అనుభవం ఎదురైంది.

రెండు సెకన్ల నిడివిగల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి మోదీ రాక సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీకుమార్ అక్కడికి వచ్చారు.

ప్రధాన వేదిక వద్దకు వస్తున్న సమయంలోనో లేదా వెళ్లే సమయంలోనో ఇద్దరు ఉన్నతాధికారులు వేదికకు సమీపంలో నిల్చుని ఉన్నారు. మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ ఒక ఎస్పిజి అధికారి పక్కకు వెళ్లండి వెళ్లండి అంటూ సూచించారు.

ఎస్పిజి అధికారి సూచన మేరకు వారిద్దరూ మరో మాట మాట్లడకుండా పక్కకు జరిగారు. ట్విటర్‌లో షేర్ చేసిన ఈ రెండు సెకన్ల వీడియోపై పలువురు పలు రకాలుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉండదు, అధికారుల మీద గౌరవం ఉండదంటూ, ఇంకా ఉద్దరిద్దామని వస్తుంది బిజెపి అంటూ ఒకరు రీ ట్వీట్ చేశారు.

సిఎం కెసిఆర్ ప్రొటోకాల్ పాటించలేదు, అందుకే వీరిద్దరికి ఎస్పిజీ ప్రొటోకాల్ విలువేంటో చూపించింది. అయిపోయిన తరువాత ఇక్కడ ఇంకేం చేస్తారు అంటూ పదండి అని అన్నాడు. కెసిఆర్ ప్రొటోకాల్ పాటించకపోతే ఎస్పిజి ప్రొటోకాల్ పాటించదు అంటూ మరొకరు స్పందించారు.